జాతీయ వార్తలు

ఇద్దరు అల్‌ఖైదా మిలిటెంట్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: అల్‌ఖైదాతో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఢిల్లీ పోలీసులు బుధవారం తొలిసారిగా దేశంలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రాంతానికి చెందిన ఆసిఫ్ అనే 41 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసుకు చెందిన ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. అయితే ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. అరెస్టు చేసినవాళ్లు పాకిస్తాన్, అఫ్గానిస్థాన్‌లను సందర్శించారని, అక్కడ తాలిబన్ కేంద్రాల్లో శిక్షణ కూడా పొందినట్లు తెలుస్తోంది. అలాగే ఒడిశాలోని కటక్‌లో జగత్‌పూర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రెహమాన్ అనే మరో అనుమానితుడ్ని కూడా అరెస్టు చేసారు. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ పోలీసులు, భువనేశ్వర్-కటక్ కమిషనరేట్‌కు చెందిన పోలీసుల సంయుక్త బృందం పశ్చిమ కచ్చా గ్రామంలో అబ్దుల్ రహమాన్ అనే అతణ్ణి అతని ఇంటిలో అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ ఆర్‌పి శర్మ భువనేశ్వర్‌లో విలేఖరులకు చెప్పారు. రహమాన్ గత కొంతకాలంగా ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని, ‘అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్’ (్భరత ఉపఖండంలో అల్‌ఖైదా)కోసం రిక్రూట్‌మెంట్లు కొనసాగిస్తున్నాడని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని ఆయన చెప్పారు. సౌదీ అరేబియా, పాకిస్తాన్, దుబాయిలాంటి పలు దేశాల్లో రహమాన్‌కు అంతర్జాతీయ సంబంధాలున్నాయని ఆయన తెలిపారు. లండన్‌లో నివసిస్తున్న భారత ఉపఖండానికి చెందిన పలువురితోను, అలాగే జార్ఖండ్, యుపి, కర్నాటకలాంటి పలు రాష్ట్రాల్లో చాలామందితో అతనికి సంబంధాలున్నాయని కూడా ఆయన చెప్పారు. 37 ఏళ్ల రహమాన్ ఇంటినుంచి ఒక ట్యాబ్, మొబైల్ ఫోన్, పాస్‌పోర్టు సహా పలు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు శర్మ చెప్పారు. కోల్‌కతాలోని అమెరికన్ సెంటర్‌పై ఉగ్రవాద దాడికి సంబంధించి రహమాన్ సోదరుడు తాహిర్ అలీని 2001లో అరెస్టు చేసినట్లు కూడా పోలీసు కమిషనర్ చెప్పారు. కటక్ జిల్లాలోని సాలెపూర్ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ట్రాన్సిట్ రిమాండ్‌పై ఢిల్లీకి తీసుకెళ్లి ప్రశ్నిస్తారని తెలుస్తోంది. కాగా, భారత్‌లో అల్‌ఖైదాతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేయడం ఇదే మొదటిసారి.