జాతీయ వార్తలు

అస్సాంలో బోడో మిలిటెంట్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోక్రాఝార్, ఆగస్టు 5: అస్సాంలో మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. శుక్రవారం కోక్రాఝార్ జిల్లాలో రద్దీగా ఉండే ఓ మార్కెట్‌పై దాడి చేసి 14 మందిని కాల్చి చంపేసారు. కాల్పులకు తెగబడ్డ దుండగుల్లో ఒకరిని భద్రతా దళాలు కాల్చి చంపేశాయి. మిలిటెంట్ల కాల్పుల్లో మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కోక్రాఝార్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోని బలజన్ తినియాలీ మార్కెట్‌పై దాడి చేసింది నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్‌డిఎఫ్‌బి-ఎస్) మిలిటెంట్లే అయి ఉంటారని భావిస్తున్నామని అస్సాం డిజిపి ముకేష్ సహాయ్ చెప్పారు. 12 మంది సంఘటన స్థలంలో చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తూ ఉండగా దారిలో చనిపోయారని ఆయన తెలిపారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని, ఆరుగురిని గుర్తించడం జరిగిందని తెలిపారు. భద్రతా దళాలు కాల్చి చంపిన మిలిటెంట్‌ను ఇంకా గుర్తించలేదని కూడా తెలిపారు. దగ్గర్లోని భవనాల్లో ముగ్గురు లేదా నలుగురు మిలిటెంట్లు దాగి ఉండవచ్చని అనుమానిస్తున్నామని, వారికోసం గాలింపు కొనసాగుతోందని డిజిపి చెప్పారు. సంఘటన స్థలంనుంచి ఎకె-56, 47 సిరీస్ రైఫిళ్లు, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండగా, వారంతా కోక్రాఝార్‌లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. హోం శాఖ అస్సాం ప్రభుత్వంతో టచ్‌లో ఉందని కూడా ఆయన తెలిపారు. అస్సాం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సంఘటనా స్థలానికి వెళ్లి, భద్రతా పరిస్థితిని సమీక్షించాలని రాష్ట్ర ఆర్థిక, విద్య, ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా మృతుల కుటుంబాలకు తలా 5 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్ప గాయాలయిన వారికి 20 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియాను రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ ఈ దాడి చాలా దురదృష్టకరమైందని అభివర్ణించారు. జాతీయ భద్రతా సలహాదారు ఎకె దోవల్ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు దాడి గురించి వివరాలు తెలియజేశారు.
కాగా, సైనిక దుస్తులు ధరించిన అయిదుగురు మిలిటెంట్లు ఒక వ్యాన్‌లో వచ్చారని, 16నుంచి ఇరవై నిమిషాల పాటు ఏకబిగిన కాల్పులు జరిపారని, ఈ మారణకాండ ప్రత్యక్ష సాక్షి అయిన మానిక్ దేబ్‌నాథ్ అనే దుకాణదారు చెప్పాడు. వారంతా తమ ముఖాలను కనిపించకుండా కప్పేసుకున్నారని అతను చెప్పాడు.మిలిటెంట్లు ఒక గ్రెనేడ్ కూడా విసిరేవారని, ఫలితంగా ఎనిమిది దుకాణాల్లో మంటలు చెలరేగాయని, జనం కేకలు పెడుతూ చెల్లాచెదరుగా పరుగులు పెట్టారని కూడా అతను చెప్పాడు.