జాతీయ వార్తలు

హోదా రాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5:ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలిసింది. చంద్రబాబు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో నరేంద్ర మోదీతో దాదాపు 25 నిమిషాలసేపు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై ఇరువురూ చర్చలు జరిపారు. ఏపికి హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ లేదా ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తామని మోదీ చెప్పినట్లు బిజెపి వర్గాలు వెల్లడించాయి. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా సహా పలు ఇతర రాష్ట్రాలు ప్రత్యేక హోదాను డిమాండ్ చేసే అవకాశం ఉందనీ, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కూడా హోదా ఇవ్వటం సాధ్యం కాదని ప్రధాని చెప్పారనే మాట వినిపిస్తోంది. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే ఎంత ఆర్థిక ప్రయోజనం కలుగుతుందో అంతకంటే మరికాస్త ఎక్కువ ప్రయోజనాన్ని ప్రత్యేక ప్యాకేజీ లేదా ప్రత్యేక ఆర్థిక సహాయం ద్వారా అందజేస్తామని మోదీ హామీ ఇచ్చారని చెబుతున్నారు.
కాగా ప్రత్యేక హోదా అంశాన్ని విపక్షాలు ఏ విధంగా రాజకీయం చేస్తున్నాయి, దీనివలన తనకు రాజకీయంగా ఎలా నష్టం కలుగుతున్నదీ చంద్రబాబు వివరించారనే మాట వినిపిస్తోంది. ఏపికి అభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని చంద్రబాబు గట్టిగా వాదించారని టిడిపి నేతలు చెబుతున్నారు.

చిత్రం..

ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన సిఎం చంద్రబాబు