జాతీయ వార్తలు

ఇదీ డిడిసిఎ బాగోతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఢిల్లీ క్రికెట్ సంఘంలో పెద్దయెత్తున అవినీతి జరిగిందంటూ పార్లమెంటు సభ్యుడు కీర్తి ఆజాద్ ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీపై పరోక్షంగా ఆరోపణలు చేయటంతో బిజెపి ఇరకాటంలో పడింది. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా గత రాత్రి కీర్తి ఆజాద్‌ను తన కార్యాలయానికి పిలిపించుకుని జైట్లీపై ఎలాంటి ఆరోపణలు చేయకూడదని కట్టడి చేసిన తరువాత కూడా ఆయన ఆదివారం సాయంత్రం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర మంత్రిపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నిన్న పటియాలా కోర్టుకు హాజరైన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ రేపు పార్లమెంటు ఉభయ సభల్లో కీర్తి ఆజాద్ చేసిన ఆరోపణలపై చర్చకు పట్టుపట్టేందుకు సిద్ధమవుతోంది. కీర్తి ఆజాద్ ఆదివారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీ క్రికెట్ సంఘంలో పలు కుంభకోణాలు జరిగాయన్నారు. జైట్లీ దీనికి అధ్యక్షుడుగా వ్యవహరించిన సమయంలోనే ఈ కుంభకోణాలు జరిగాయని ఆయన పరోక్షంగా సూచించటం గమనార్హం. అరుణ్ జైట్లి 2013 వరకు డిడిసిఏ అధ్యక్షుడుగా పని చేసిన సంగతి తెలిసిందే. డిడిసిఏ దాదాపు పదమూడు ఊరు, పేరు లేని కంపెనీలకు పలు కాంట్రాక్టులు మంజూరు చేసిందన్నది ఆజాద్ ప్రధాన ఆరోపణ. చిరునామా లేని ఈ కంపెనీలకు కోట్లాది రూపాయలు చెల్లించారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ చేత ఈ కాంట్రాక్టుల గురించి దర్యాప్తు జరిపించాలని ఆజాద్ డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన పోరాటం అంటే తనకు ఎంతో ఇష్టమంటూ ఆజాద్ తన విలేఖరుల సమావేశాన్ని ప్రారంభించటం గమనార్హం. మోదీ అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకే తానీ విషయాలు వెల్లడిస్తున్నానంటూ ఆయన జైట్లీకి ఉచ్చు బిగించేందుకు ప్రయత్నించటం చర్చనీయాంశంగా మారింది. ‘ల్యాప్‌ట్యాప్‌ను రోజుకు పదహారు వేల రూపాయల చొప్పున అద్దెకు తీసుకున్నారు. ప్రింటర్‌కు రోజుకు మూడు వేల రూపాయలకు అద్దె చెల్లించారు. పూజ చేసేందుకు ఉపయోగించే పళ్లేన్ని ఐదు వేల రూపాయలకు ఒకటి చొప్పున కొనుగోలు చేశార’ని ఆజాద్ ఏకరవు పెట్టారు. ఇలాంటి పలు కుంభకోణాలకు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతానని ఆజాద్ ప్రకటించారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో జరిగిన కుంభకోణాలకు సంబంధించిన పలు ఆడియో, వీడియో టేపులను ఆయన విలేఖరులకు చూపించారు. తాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని రహస్యంగా కలుసుకున్నట్లు జైట్లీ చేసిన ఆరోపణలను ఆజాద్ తీవ్రంగా ఖండించారు. జైట్లీ దాదాపు పదమూడు సంవత్సరాల పాటు ఢిల్లీ క్రికెట్ సంఘం, డిడిసిఏ అధ్యక్షుడుగా పని చేసినప్పుడు ఆయనకు, కీర్తి ఆజాద్‌కు మధ్య పలు గొడవలు జరగటం విదితమే. ఆమ్ ఆద్మీ పార్టీ గత వారం అరుణ్ జైట్లిపై ఇలాంటి ఆరోపణలే చేయటం తెలిసిందే. అయితే తాను డిడిసిఏ అధ్యక్షుడిగా పని చేసినప్పుడు జరిగినట్లు చెబుతున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిగిందనీ, ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని దర్యాప్తు సంఘం ఇది వరకే నివేదికలు ఇచ్చిందనీ జైట్లీ తెలిపారు.