జాతీయ వార్తలు

ఈస్టిండియా కంపెనీ చరిత్ర పునరావృతం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసే క్రమంలో భారత దేశాన్ని బానిస దేశంగా మార్చిన ఈస్టిండియా కంపెనీ చరిత్రను పునరావృతం చేయవద్దని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరించారు. వ్యాపారం పేరుతో దేశంలో అడుగుపెట్టిన ఈస్టిండియాకంపెనీ వ్యాపారం పెంచుకుంటూ నెమ్మది నెమ్మదిగా దేశాన్ని ఆక్రమించుకున్నట్లు అమరావతి రాజధాని నిర్మాణం పేరిట విదేశీ కంపెనీలు చేస్తున్న డిమాండ్లు భవిష్యత్‌లో అనేక ఇబ్బందులకు దారి తీసే ప్రమాదం ఉందని ఆయన విలేఖరులకు చెప్పారు. ఈస్టిండియా కంపెనీ వ్యవహారం తిరిగి పునరావృతం కాని తీరులోప్రభుత్వం ఆచి తూచి వ్యవహరించాలని సూచించారు. అమరావతిని అత్యంత ఆకర్షణీయంగా అతి పెద్దరాజధానిగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు తాను వ్యతిరేకం కాదన్నారు. అయితే ప్రజల ప్రాణ రక్షణ, ఆహార భద్రత, సారవంతమైన భూముల పరిరక్షణ, ముంపుప్రమాదం లేకుండా రాజధాని నిర్మాణం జరగాలన్నదే తన అభిమతమని తెలియ జేశారు. కేంద్రప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులకు వ్యతిరేకంగారాజధాని నిర్మాణం జరుగుతోందని ఆయన చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాన మంత్రి మోదీ మట్టి, నీరు పట్టుకు వచ్చి ఆంధ్రులను నిరాశ పరిచినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడాప్రజలకు మట్టి, నీరునే ఇచ్చే అవకాశాలున్నాయని ఆయన వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్యావరణ కమిటీలో నిపుణులు లేరని ఆయన తెలియ చేశారు.
ప్రస్తుతం 33వేల ఎకరాల భూమిలో వ్యవసాయం చేసే వీలు లేకుండా పోయింది. రానున్న కాలంలో ఇరవై లక్షల ఎకరాల భూమిలో వ్యవసాయం ఆగిపోయే అవకాశాలుండటంతో దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లేప్రమాదం ఉండగా వ్యవసాయంపై ఆధార పడి జీవించే వేలాది కుటుంబాలు వీధుల పాలు అవుతాయని కెవిపి చెప్పారు. ఈ పరిస్థితి అనూహ్యమైన పరిస్థితులకు దారి తీసే ప్రమాదం ఉంటుందని ఆయన హెచ్చరించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖనుంచి అన్ని అనుమతులు రాకుండానే రాష్ట్ర స్థాయి కమిటీ మంజూరు చేసిన అనుమతులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపట్టటం విడ్డూరంగాఉందని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణమవుతున్న ప్రాంతం అంతా సారవంతమైన భూములున్నాయని ఆయన చెప్పారు. రైతులు ఒక్క అంగుళం భూమి కూడా వృధాగా ఉంచరని ఆయన చెప్పారు. వరదలు వచ్చినప్పుడు తప్పించి ఈ భూములలో వరితోసహా అనేక పంటలు పండుతుంటాయని రామచంద్రరరావుచెప్పారు. అమరావతిలో రాజధాని నిర్మాణం నియమ నిబంధనలకు విరుద్ధంగానేకాక ప్రజల ప్రాణానికి ముప్పు కలిగించే విధంగా జరుగుతోందని సాక్ష్యాధారాలతోప్రధాని మోదీకి ఒక సమగ్రమైన వినతి పత్రం అందజేసినట్లు రామచంద్రరరావు చెప్పారు.