జాతీయ వార్తలు

ఒకేచోట రామాలయం, మసీదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య/న్యూఢిల్లీ, డిసెంబర్ 20: అయోధ్య వ్యవహారం ఇటు రాజకీయ, అటు న్యాయపరమైన అంశాల్లో చిక్కుకుపోవడంతో ఈ జటిల సమస్యను పరిష్కరించేందుకు ఓ మాజీ న్యాయవాది ముందుకొస్తున్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా శాంతియుతంగా ఈ సంక్లిష్ట సమస్యను ఓ కొలిక్కి తెస్తానని పలోప్ బసు అనే ఈ మాజీ న్యాయవాది చెబుతున్నారు. ఇందులో భాగంగా అయోధ్య, ఫైజాబాద్ ప్రాంతాలకు చెందిన ఏడువేల మందికి పైగా ప్రజలను శాంతియుత ఉద్యమానికి సమాయత్తం చేశారు. వీరందరితో కలిసి ఈ సమస్యను ఉభయ తారకంగా పరిష్కరిస్తానని పలోప్ బసు చెబుతున్నారు. తన ప్రతిపాదనలకు ఈ రెండు పట్టణాల ప్రజలు అంగీకరించారనీ, ఓ పిటిషన్‌పై సంతకాలు చేశారని వెల్లడించారు. అయోధ్యలోని రామజన్మభూమి / బాబ్రీ మసీదు స్థలంలో ఓ రామాలయాన్ని, మసీదును నిర్మించాలన్నది పలోప్ బసు ప్రతిపాదన. అయితే ఇక్కడ నిర్మించే మసీదుపై మొఘల్ చక్రవర్తి బాబర్ పేరు ఉండదని ఆయన వెల్లడించారు. అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన స్థానిక ప్రజల మద్దతుతోనే అయోధ్య సమస్యను పరిష్కరించేందుకు గత ఐదేళ్లుగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఈ రెండు ప్రాంతాలకు చెందిన పదివేల మందికి పైగా హిందూ ముస్లిం ప్రజలను సమీకరించి వారందరితోనూ స్థానిక ప్రాతిపదికగానే అయోధ్య సమస్యను నివృత్తి చేయాలన్నదే తన లక్ష్యమని ఆయన తెలిపారు. ఇప్పటికే ఏడువేలమంది సంతకాలు సేకరించగలిగానని, పదివేల సంతకాలు లభించిన తర్వాత సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తానని తెలిపారు. శాంతియుత పరిష్కారానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ ఈ అప్పీలులో సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేస్తామని తెలిపారు.