జాతీయ వార్తలు

ఆస్తుల తీర్పుపై పునస్సమీక్ష లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఉమ్మడి ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకాలపై అత్యున్నత ధర్మాసనం తీర్పును పున:పరిశీలించాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రెండో రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. రెండో పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ గోపాల్ గౌడ్,జస్టిస్ అరుణ్ మిశ్రాలు తమ చాంబర్‌లో పరిశీలించి గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఉమ్మడి ఉన్నత విద్యామండలి వివాదంపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపి ఉన్నత విద్యామండలి, ఏపి రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు దీనిపై మార్చి 18న తీర్పు ఇచ్చింది. ఉమ్మడి ఉన్నత విద్యామండలి సహా ఉమ్మడి సంస్థలు, వాటా ఆస్తులు,బ్యాంకు ఖాతాల్లోని నగదు నిల్వలను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని ఆదేశించింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు రెండు నెలల్లోపు చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 18 తేదీన రివ్యూ పిటిషన్లును సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి. దీనిపై ఒక పిటిషన్‌ను ఈ నెల 10న న్యాయమూర్తులు జస్టిస్ గోపాల్ గౌడ,జస్టిస్ అరుణ్ మిశ్రాలు తోసిపుచ్చారు. మరొక పిటిషన్‌ను మంగళవారం పరిశీలించిన న్యాయమూర్తులు తీర్పును పునస్సమీక్షించేది లేదని పునరుద్ఘాటించింది.