జాతీయ వార్తలు

విజయవాడ-గూడూరు మధ్య మూడో రైల్వే లైను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 24: ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ-గూడూరు మధ్య రూ. 3,875 కోట్ల వ్యయంతో మూడో రైల్వే లైను నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ జంక్షన్-గూడూరు మధ్య 287.67 కిలోమీటర్ల మూడో రైల్వే లైను నిర్మించేందుకు రూ.3,246 కోట్లు ఖర్చు అవుతుందని ఆంచనా వేసినాప్రాజెక్టు పూర్తి అయ్యేనాటికి దీని మొత్తం ఖర్చు రూ.3,875.68 కోట్లు అవుతుందని కేంద్ర ప్రభుత్వం తమ పత్రికా ప్రకటనలో తెలిపింది. 287 కిలోమీటర్ల మూడో రైల్వే లైను నిర్మాణం పూర్తయ్యేందుకు ఆరేళ్లు పడుతుంది. విజయవాడ జంక్షన్-గూడూరు మధ్య మూడో రైల్వే లైనును నిర్మించటం వలన ప్రయాణ సౌకర్యాలు పెరగటంతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు ఆహార ధాన్యాల రవాణా మరింత సులభతరం అవుతుందంది. దీనితోపాటు కృష్ణపట్నం ఓడ రేవుకు సరుకులను రవాణా చేసేందుకు అదనపు సౌకర్యం ఏర్పడుంతుందన్నారు. మూడో రైల్వే లైను నిర్మాణం వలన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ,గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రం తెలిపింది. విజయవాడ జంక్షన్ - గూడూరు రైల్వే లైను ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలిపే గ్రాండ్ ట్రంక్ లైనులో భాగం.