జాతీయ వార్తలు

కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 24: శ్రీకృష్ట భగవానుడి జయంతి సందర్భంగా దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో జన్మాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులు పాటు జన్మాష్టమి వేడుకలు జరుగుతాయి. నగరంలోని గిర్‌గావ్ చౌపట్టీలోని ప్రసిద్ధ ఇస్కాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం మహాఆరతి చేపట్టినట్టు ఇస్కాన్ ఆధ్యాత్మి గురువు రాధానాథ్ స్వామి మహారాజ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. శ్రీకృష్ణుడు జన్మించి 5,243 ఏళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని అంతే సుంఖ్యలో ఫలాలను సమర్పించారు. మహాఆరతి, మహాభిషేక కార్యక్రమాలు చేపట్టినట్టు ఇస్కాన్ అధికార ప్రతినిధి లక్కీ కులకర్ణి చెప్పారు. ఈనెల 25 అర్థరాత్రితో మూడు రోజుల జన్మాష్టమి కార్యక్రమాలు ముగుస్తాయని ఆయన అన్నారు.