జాతీయ వార్తలు

తక్షణమే ఆధార్ అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వర ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అధికారులను ఆదేశించారు. 5-18 సంవత్సరాల మధ్య వయసుకలిగిన పిల్లలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఆ విధంగా వారికి విద్యాపరమైన ప్రయోజనాలు, ఉపకార వేతనాలు అందేలా చూడాలని రాష్ట్రాలను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాలకు విస్తరించిన రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు, రైల్వేలు వంటివాటి పనితీరును మోదీ సమీక్షించారు.
నెలవారీగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులతో జరిగే సమావేశంలో ఈ ప్రాజెక్టులను ప్రధాని సమీక్షించారు. అన్ని రాష్ట్రాల అధికారులతో ఈ కీలక వౌలిక ప్రాజెక్టుల అమలు తీరుతెన్నుల గురించి తెలుసుకున్నారు. అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యతకు సంబంధించిన అంశాలపై కూడా దృష్టిపెట్టిన మోదీ వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం తమ ఇబ్బందులు అన్నింటినీ పరిష్కరిస్తుందన్న నమ్మకం ప్రజల్లో పెరిగిందని వాటికి అనుగుణంగానే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన ఏ సమస్య విషయంలోనూ జాప్యం జరగకూడదని అధికారులను మోదీ ఆదేశించారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న సాంకేతిక ప్రకరణలన్నింటినీ వినియోగించుకోవాలని సూచించారు. దీని వల్ల అనేక రకాలుగా సమస్యల సత్వర పరిష్కారానికి ఆస్కారం ఉంటుందన్నారు. అలాగే సుగమ్య భారత్ అభియాన్ కార్యక్రమ తీరుతెన్నులను కూడా ఆయన సమీక్షించారు. దాదాపుగా ఆధార్‌ను అనుసంధానత 105 కోట్లకు చేరువైందని, ఈశాన్య రాష్ట్రాల విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఓ అధికారిక ప్రకటనలో పిఎంవో తెలిపింది.