జాతీయ వార్తలు

కీలక బిల్లులకు ఇక మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: మరో మూడు రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియనున్నందున ఈలోగానే పెండింగ్‌లో వున్న బిల్లులన్నింటినీ గణనీయ పరిమాణంలో ఆమోదింపజేసుకోవాలని కేం ద్ర ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంటులో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సయోధ్య కుదిరిన నేపథ్యంలో పెండింగ్ బిల్లుల వ్యవహారాన్ని దాదాపుగా ఒక కొలిక్కి తేవాలని ఆశిస్తోంది.
సోమవారంనుంచి ఇందుకు సంబంధించిన ప్రక్రియను చకచకా చేపడతారు. గత మూడు వారాలుగా పార్లమెంటు ఉభయ సభల్లో ము ఖ్యంగా రాజ్యసభలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ అన్సారీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీలో అధికార విపక్షాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. రెండు పక్షాలకు మధ్య ఏకాభిప్రాయం ఉన్న బిల్లులను తక్షణ ప్రాతిపదికన చేపట్టడానికి అంగీకరించాయి. జిఎస్‌టి మినహా దాదాపు అన్ని బిల్లులకు ఈ మూడు రోజుల వ్యవధిలో పార్లమెంటు ఆమోదం లభించే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. లోక్‌సభలో శీతాకాల సమావేశాలు మొదలైనప్పటినుంచి అలజడుల మయంగానే పరిస్థితులు ఉండటం వల్ల 18 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే రాజ్యసభలో కూడా శీతాకాల సమావేశాల్లో కొత్త బిల్లులను ప్రవేశపెట్టే పరిస్థితే లేకుం డా పోయింది. చెక్‌బౌన్స్ కేసులకు సంబంధించిన అన్యాక్రాంత యోగ్య తా పత్రాల (సవరణ) బిల్లును మాత్రం ఆమోదించారు. తాజాగా శాసన, ఆర్థిక సంబంధిత అంశాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి లో ఎస్‌సి, ఎస్‌టిలపై అత్యాచారాల నిరోధక బిల్లు, రియల్ ఎస్ట్రేట్ నియంత్రణ అభివృద్ధి బిల్లు, విజిల్‌బ్రోవర్ల భద్రత బిల్లు మొదలైనవి ఉన్నాయి. వీటన్నింటిని ఈ మూడు రోజుల్లో ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్‌సి, ఎస్‌టి బిల్లులకు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీల మధ్య రాజకీయ ఏకాభిప్రాయం కుదిరింది. ద్రవ్య వినిమయ బిల్లు, హైజాకింగ్ నిరోధక బిల్లు, అణుఇంధన సవరణ బిల్లు, వాణిజ్య కోర్టుల ఆర్డినెన్స్ బిల్లు మొదలైనవి సోమవారం నాడు చర్చకు రాబోతున్నాయి. వీటితోపాటు ఎలాంటి వివాదాస్పదం కా ని మిగతా బిల్లులను చర్చించి ఉభ య సభలు ఆమోదించే అవకాశాలు తాజా సానుకూలత నేపథ్యం లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.