జాతీయ వార్తలు

భుజాల మీదే శవమయ్యాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, ఆగస్టు 30:వైద్యో నారాయణో హరి..ప్రాణ భిక్ష పెట్టే వైద్యుడు దేవుడితో సమానమన్న మాట. ఆ మాటకొస్తే వైద్య కేంద్రాలన్నీ దేవాలయాలే..దేవుళ్లతో సమానమైన వైద్యులతో నిండినవే! కానీ ఓ తండ్రి తన పనె్నండేళ్ల కొడుకును కాపాడాలంటూ వైద్యుల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేక పోయింది. కొడుకు పరిస్థితి క్షణక్షణానికీ క్షీణించడంతో అతడ్ని భుజాన వేసుకుని మరీ రోడ్లపై పరుగులు పెట్డాడు. చివరికి వైద్యుడు కరుణించక..తండ్రి భుజాల మీదే ఆ కొడుకు కన్నుమూశాడు! ఈ హృదయ విదారక ఘటన కాన్పూర్‌లో జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి..సకాలంలో చికిత్స అందక పోతే అది ఎలాంటి హృదయ వేదనకు దారితీస్తుందో చెప్పడానికి..కన్నబిడ్డను కాపాడుకోవడానికి ఓ తండ్రి పడ్డ వేదన, ఆవేదనకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. సుశీల్ కుమార్ తన పనె్నండేళ్ల కొడుకును తీసుకుని మొదట లాలాలజపతిరాయ్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ అడ్మిషన్ దొరక లేదు. దగ్గర్లోనే అంటే 250మీటర్ల దూరంలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. ఎలాంటి స్ట్రెచర్ లేకుండా, ఎవరి ఆసరా తీసుకోకుండా అంతదూరమూ తన కొడుకును భుజాన వేసుకుని ఆ తండ్రి పరుగులు పెట్టాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి చేరుకునే లోగానే ఆ బాలుడు మరణించాడు. ‘ఎలాగైనా కొడుకును కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అతడ్ని భుజాన వేసుకుని రోడ్లపై పరుగులు పెట్టాను. మొదట లాలాలజపతి రాయ్ ఆసుపత్రికి తీసుకెళ్లాను. అక్కడ ఎవరూ కనికరించలేదు. చికిత్స చేయడానికి ముందుకు రాలేదు. విలువైన అరగంట కాలం అక్కడే గడిచిపోయింది. తర్వాత పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లాను..పది నిముషాలు ముందు వచ్చి ఉంటే నీ కొడుకు బతికేవాడు..’అంటూ ఆ ఆసుపత్రి వైద్యులు చెప్పారంటూ సునీల్ కుమార్ గుండెలు బాదుకున్నాడు. దీని కంటే ముందు అతడు తన కుమారుడ్ని స్థానికంగా ఉన్న వైద్యుల వద్దకు తీసుకెళ్లాడు. పెద్ద ఆసుపత్రికి తీసుకెళితే మంచి వైద్యం అందుతుందంటూ వారు సలహా ఇవ్వడంతో కాన్పూర్ ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. కాగా, ఆ బాలుడ్ని ఎందుకు చేర్చుకోలేదంటూ లాలాజలపతిరాయ్ కాలేజీ, ఆసుపత్రి అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ఈ విచారణ ఫలితాలు ఎలా ఉన్నా..ఆ తండ్రి పుత్ర శోకం తీరేది కాదు.