జాతీయ వార్తలు

టీ, సమోసాలకు 9 కోట్ల ఖర్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 31: నిత్యం పొదుపు గురించి ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పాలకులు దాన్ని పాటించే విషయంలో ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఖజానాకు గండిపెడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలోని మంత్రులు అతిధుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేశారు. టీలు, సమోసాలు, గులాబ్ జామూన్‌లకు ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. 2012 మార్చిలో అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ నాలుగేళ్ల కాలంలో టీ పార్టీల కోసమే ఇంత అయింది. మొత్తం 8,78,12,474 రూపాయలు ఖర్చయినట్టు లెక్కలు చూపారు. 2016 మార్చి 15 వరకూ టీలు, సమోసాలు, గులాబ్ జామూన్లకు ప్రభుత్వ ఖజానా నుంచి మంత్రులు పెట్టిన ఖర్చు బుధవారం అసెంబ్లీలో వెల్లడించారు. 22,93,800 రూపాయలు ఖర్చుచేసి సహాయ మంత్రి అరుణ్‌కుమార్ కోరి అందరికంటే ముందున్నారు. ఆమె సాంఘిక సంక్షేమ శాఖను నిర్వహిస్తున్నారు. పట్టణాభివృద్ధి మంత్రి మహ్మద్ అజాంఖాన్ 22,86,620 రూపాయలతో రెండో స్థానంలో ఉన్నారు. మహిళా శిశు సంక్షేమం, ప్రాథమిక విద్యా మంత్రి కైలాష్ చౌరాసియా అక్షరాల 22 లక్షల 85 వేల 900 రూపాయలు టీలు, సమోసాలకు ఖర్చుచేశారు. అయితే పబ్లిక్ వర్క్స్ మంత్రి శివపాల్ యాదవ్ మాత్రం రిఫ్రిష్‌మెంట్‌కి ఒక్కపైసా ఖజానా నుంచి తీసుకోకపోవడం గమనార్హం. ఇక సీనియర్ మంత్రులు రామ్‌కరణ్ ఆర్య, జగదీష్ సోంకర్ 21 లక్షల రూపాయల పైనే అల్పాహారానికి ప్రభుత్వ సొమ్ములు వెచ్చించారు. నిబంధనల ప్రకారం మంత్రులు స్థానికంగా ఉంటే రిఫ్రెష్‌మెంట్ ఖర్చు నిమిత్తం రోజుకు 2,500 రూపాయలు, బయటకు వెళితే 3000 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు. 2015 వరకూ మంత్రి పదవిలో ఉన్న శివకుమార్ బెరియా 21,93,900 రూపాయలు స్నాక్స్‌కు ఖర్చుచేశారు.
మహిళ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ఏడాదిపాటే పనిచేసిన సదాబ్ ఫాతిమా 72,500 రూపాయలు టీలు, సమోసాలకు ఖర్చుచేశారు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం దుబారాపై బిజెపి నిప్పులు చెరిగింది. టీ, సమోసాలకు కోట్ల రూపాయలు ఖర్చుచేసూ ప్రజాధనాన్ని కొల్లగొట్టారని బిజెపి అధికార ప్రతినిధి హరిశ్చంద్ శ్రీవాత్సవ్ విమర్శించారు. అయితే అధికార కార్యక్రమాల నిమిత్తమే దీన్ని ఖర్చుచేసినట్టు సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి సమర్థించుకున్నారు.