జాతీయ వార్తలు

మళ్లీ మార్కెట్లోకి ‘నేషనల్ హెరాల్డ్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: కాంగ్రెస్ అధికార పత్రిక ‘నేషనల్ హెరాల్డ్’ తిరిగి ప్రజల్లోకి రానుంది. 2008లో నిలిచిపోయిన ఈ పత్రికను తిరిగి ప్రచురించనున్నట్లు దాని యాజమాన్య సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్) బుధవారం ప్రకటించింది. సీనియర్ జర్నలిస్టు నీలభ్ మిశ్రా ఈ పత్రికకు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. 1937లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన ఎజెఎల్ తన ఇంగ్లీషు వార్తాపత్రిక నేషనల్ హెరాల్డ్, హిందీ వార్తాపత్రిక నవజీవన్‌లను తిరిగి ప్రచురిస్తుందని ఎజెఎల్ మేనేజింగ్ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా బుధవారం ప్రకటించారు. ఈ రెండు పత్రికలకు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా నీలభ్ మిశ్రాను నియమించినట్లు ఆయన వివరించారు. అయితే ఈ రెండు పత్రికలు ఖచ్చితంగా ఏ తేదీనుంచి మార్కెట్లోకి వస్తాయనేది వెల్లడించలేదు. రానున్న నెలల్లో వీటి ప్రచురణను పునరుద్ధరిస్తామన్నారు. వాటి తరువాత నిలిచిపోయిన ఉర్దూ వార్తాపత్రిక ‘క్వామి ఆవాజ్’ ప్రచురణను పునరుద్ధరిస్తామని వివరించారు.

మిశ్రా గతంలో ఔట్‌లుక్ (హిందీ) పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు.