జాతీయ వార్తలు

పౌర హక్కులు కాపాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: కులం, మతం, భాషతో సంబంధం లేకుండా దేశ పౌరులందరి హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ నొక్కి చెప్పారు. జైల్లో పెడతారన్న భయం లేకుండా ప్రజలు శాంతియుతంగా నిరసన తెలపడానికి అనుమతించాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. బెంగళూరులో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థపై దేశద్రోహం కేసు పెట్టిన తర్వాత అమెరికా భావ ప్రకటనా స్వేచ్ఛకు మద్దతుగా మాట్లాడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెర్రీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్, అమెరికా దేశాలు రెండూ మన ప్రజాస్వామిక విలువలపై నమ్మకం ఉంచాలని, మన రెండు దేశాలకు మూల స్తంభాలయిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షించాలని బుధవారం ఇక్కడ ఢిల్లీ ఐఐటి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ కెర్రీ అన్నారు. జాతి, భాష, మతంతో సంబంధం లేకుండా మన పౌరులందరి హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాదం మూల కారణాలను తుదముట్టించాల్సిన అవసరం ఉందని, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి, శాంతియుతంగా నిరసన తెలియజేయాలంటే వారిలో ప్రతీకారానికి సంబంధించి ఎలాంటి భయాలు ఉండకూడదని అన్నారు. అయితే యువత నిరాశా నిస్పృహలకు లోనుకావడానికి అవినీతి, అసమర్థ పాలనలే ప్రధాన కారణాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులకు పారిపోవడానికి, దాక్కోవడానికి, దాడులకోసం ప్రణాళికలు వేసుకోవడానికి చోటులేని విధంగా చేయడానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఉగ్రవాదులు పైచేయి సాధించకుండా చూడాలంటే దాని మూల కారణాలపై దెబ్బకొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఏ సమాజమైతే తమ పౌరులందరకీ సమాన అవకాశాలివ్వదో ఆ సమాజం వారు ఉగ్రవాదులు లేదా టెర్రరిస్టులుగా మారడానికి అవకాశమిస్తుందని కెర్రీ అభిప్రాయ పడ్డారు. అందువల్ల అన్ని మతాలు, జాతుల మధ్య శాంతి, సహనం, సమానత్వం, ప్రేమ వారధులను నిర్మించాలని, ఈ విషయాలల్లో భారత్, అమెరికా దేశాల మధ్య ఎంతో సారూప్యత ఉందని కెర్రీ అన్నారు.
ఢిల్లీ ఐఐటి విద్యార్థులనుద్దేశించి
మాట్లాడుతూ జాన్ కెర్రీ