జాతీయ వార్తలు

ఓడినచోటే ‘గెలుద్దాం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: గత లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఓడిపోయిన స్థానాలను దత్తత తీసుకుని తదుపరి ఎన్నికల్లో అక్కడ విజయం సాధించడానికి కృషి చేయాలని పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలను అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించారు. పార్లమెంటులో తాను ఈ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని భావించి వీటి అభివృద్ధికి తోడ్పడాలని ఎంపీలను కోరారు. ఇలా చేయడం వల్ల రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వీటిలో కూడా విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 52మంది బిజెపి రాజ్యసభ సభ్యులతో ఆయన బుధవారంనాడు సమావేశమయ్యారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ బిజెపి ముఖ్యమంత్రులతో, పార్టీ సీనియర్లతో సమావేశమైన నేపథ్యంలో జరిగిన ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత చేకూరింది.
తాము దత్తత తీసుకోబోయే లోక్‌సభ స్థానాల అభివృద్ధికి ఎంపి లాడ్ నిధులను ఉపయోగించాలని ఆ విధంగా ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని షా కోరారు. పార్టీ పునాదులను విస్తరించడంతో పాటు దాని సిద్ధాంతాలను కూడా పరివ్యాప్తం చేయడంలో రాజ్యసభ ఎంపీలు కూడా క్రియాశీలక భూమిక పోషించాలన్నారు. ఈ సమావేశం వివరాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ విలేఖరులకు వివరించారు. లోక్‌సభ సభ్యులను అభివృద్ధి, సంస్థాగత అజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రోత్సహిస్తున్న బిజెపి నాయకత్వం రాజ్యసభ సభ్యులను కూడా ఇందుకోసం వినియోగించుకోవాలన్న ఆలోచనకు పదునుపెట్టింది. అంతేకాదు, ప్రత్యక్ష రాజకీయాలతో తమకు సంబంధం లేకపోయినప్పటికీ పార్టీ కార్యకలాపాల్లోనూ, సిద్ధాంతాన్ని బలోపేతం చేయడంలోనూ తమను వినియోగించుకోవడం లేదన్న భావన రాజ్యసభ ఎంపీల్లో కనిపించిందని జవదేకర్ తెలిపారు.

ఢిల్లీలో బుధవారం బిజెపి రాజ్యసభ సభ్యుల సమావేశాన్ని ప్రారంభిస్తున్న అమిత్ షా