జాతీయ వార్తలు

సొంత రాజకీయ కూటమిని ఏర్పాటు చేయనున్న సిద్ధూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, సెప్టెంబర్ 2: రాజ్యసభ సభ్యత్వానికి ఇటీవల రాజీనామా చేసిన బిజెపి మాజీ నాయకుడు, టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యో త్ సింగ్ సిద్ధూ ‘ఆవాజ్ ఎ పంజాబ్’ పేరుతో సొంతగా కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేయబోతున్నాడు. పంజాబ్ శాసనసభ ఎన్నికలకు ముందు సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరబోతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపించిన విషయం విదితమే. అయితే అందుకు విరుద్ధంగా ఆయన అకాలీదళ్ నుంచి ఉద్వాసనకు గురైన కొంత మంది నాయకులతో కలసి కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ‘పంజాబ్‌ను నాశనం చేసిన శక్తులపై పోరాడేందుకు మేము కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాం. ఇందుకు సంబంధించి మూడు నాలు గు రోజుల్లోనే లాంఛనమైన ప్రకటన వెలువడుతుంది.
ఈ ప్రకటన ఎక్కడ చేయాలన్నదీ త్వరలోనే నిర్ణయిస్తాం’ అకాలీదళ్ నుంచి సస్పెన్షన్‌కు గురైన జలంధర్ శాసనసభ్యుడు పర్గత్ సింగ్ పిటిఐ వార్తా సంస్థకు వివరించాడు. ఆమ్ ఆద్మీ పార్టీతో సిద్ధూ జరిపిన చర్చలు విఫలమయ్యాయని, దీంతో పర్గత్ సింగ్‌తో పాటు అకాలీదళ్ నుంచి సస్పెన్షన్‌కు గురైన స్వతంత్ర శాసనసభ్యులు సిమర్‌జీత్ సింగ్ బైన్స్, బల్వీందర్ సింగ్ బైన్స్‌లతో సిద్ధూ సమావేశం నిర్వహించి కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాడని అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి.