జాతీయ వార్తలు

ఏపిని కేంద్రం ప్రత్యేక రాష్ట్రంగానే చూస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగానే చూస్తూ ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగేంతవరకు కేంద్రం నుండి చేయూత ఉంటుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. వెంకయ్యనాయుడు బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత విలేఖరులతో మాట్లాడుతూ ఏపికి కేంద్రం ఇచ్చే ప్యాకేజీ వలన ప్రత్యేక హోదాకు మించిన ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం వలన కలిగే నష్టాన్ని విదేశీ నిధులతో చేపట్టే పథకాల ద్వారా పూడుస్తామన్నారు. ఏపికి ఇవ్వనున్న పన్ను రాయితీలకు సంబంధించిన ఆదేశాలను కేంద్రం త్వరలోనే జారీ చేస్తుందని వెంకయ్యనాయుడు చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని హామీలను కేంద్రం పూర్తి చేస్తుందని ఆయన మరోసారి చెప్పారు.

రోడ్డెక్కనున్న నేతాజీ కారు
మరమ్మతులు ప్రారంభం * డిసెంబర్ నాటికి పూర్తి
కోల్‌కతా, సెప్టెంబర్ 7: బ్రిటిష్ పాలకుల గృహనిర్బంధం నుంచి తప్పించుకునే సమయంలో నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ ఉపయోగించిన కారు మళ్లీ రోడ్డెక్కనుంది. 1971 నుంచి ఉపయోగంలో లేని ఈ కారును సందర్శకుల కోసం నేతాజీ రీసెర్చి బ్యూరో (ఎన్‌ఆర్‌బి)లో ఉంచారు. నాలుగు డోర్లు కలిగిన జర్మన్ వాండరర్‌ను తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు జర్మన్‌కు చెందిన ఆడి కంపెనీ ప్రతినిధులు రంగంలోకి దిగారు. ‘కారుకు రంగులు వేయడం ప్రారంభించారు. పాత విడిభాగాలు తొలగించి కొత్తవి బిగిస్తున్నారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన ఈ కారును వినియోగంలోకి తెచ్చి కనీసం 100 నుంచి 200 మీటర్లు తిరిగేలా చేయాలన్నదే మా కోరిక’ అని ఎన్‌ఆర్‌బి కార్యదర్శి కార్తిక్ చక్రవర్తి తెలిపారు. కారు మరమ్మతులు డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని ఆశిస్తున్నామన్నారు. బిఎల్‌ఏ-7169 నెంబరు కలిగిన ఈ కారులోనే నేతాజీ కోల్‌కతా నుంచి జార్ఖండ్‌లోని గోమోకు తప్పించుకున్నారు. 1941లో జరిగిన ఈ ఘటన ‘గ్రేట్ ఎస్కేప్’గా చరిత్రలో నిలిచిపోయిన విషయం విదితమే. నేతాజీ కారు నడపగా ఆయన పక్కన అన్న కుమారుడు శిశిర్ కుమార్ బోస్ కూడా ఉన్నారు.

1971లో చివరిసారిగా శిశిర్ బోస్ ఈ కారును నడిపారు. ఆ తర్వాత ఈ కారు వినియోగంలో లేదు. సందర్శనార్థం ఎన్‌ఆర్‌బిలో ఉంచారు. చివరిసారిగా కారును నడిపిన ఎన్‌ఆర్‌బి సిబ్బంది నాగ సుందరం కూడా ఇప్పుడు జీవించిలేరు. దశాబ్దాల పాటు కేవలం సందర్శకులకు మాత్రమే కనువిందు చేసిన ఈ చారిత్రక కారు ఎట్టకేలకు రహదారులను సైతం అలరించనుంది.

జీతాలు కాదు..
సమాజసేవ ముఖ్యం
సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలి
ఐఐటి, ఎన్‌ఐటిల పట్ట్భద్రులకు రాష్టప్రతి పిలుపు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ఐఐటిలు, ఎన్‌ఐటిలు వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి పట్ట్భద్రులయిన విద్యార్థులు అధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలు పొంది, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికే పరిమితం కాకుండా మంచి విజ్ఞానం ఆధారంగా విద్యార్థి లోకానికి, సమాజానికి చేయూతనిచ్చేందుకు నడుం కట్టాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (ఎన్‌ఐటి) తొలి స్నాతకోత్సవంలో బుధవారం ఆయన ప్రసంగిస్తూ, ఈ విద్యాసంస్థ నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్న యువతీ యువకులు సాధించే విజయం వారు.. సమాజం, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు మంచి పరిష్కారాలను ఎంతవరకు అందించగలరన్న దానిపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ‘మీలోని విజ్ఞానం, మీరు పొందిన నైపుణ్యాలు ఒక బహుళ జాతీయ కంపనీ సరుకును ప్రమోట్ చేసినందుకు గాను మీరు పొందే అధిక వేతన ప్యాకేజీకి లేదా మీరు అనుభవించే సౌకర్యవంతమైన జీవితానికి మాత్రమే పరిమితం చేయరాదు. ఎన్‌ఐటి, ఐఐటి వంటి విద్యాసంస్థల పట్ట్భద్రులుగా మీరు చేయాల్సింది అంతకన్నా ఎక్కువగా ఉంది’ అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ‘మీరు ఎన్ని అధ్యయన పత్రాలు చదువుతున్నారు. పరిశోధనారంగంలో మీరు చేస్తున్నదేమిటి, మీరు శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన పరంగా సమాజానికి సమకూరుస్తున్నదేమిటి.. అనేవి ప్రథమే శ్రేణి ఇంజినీరింగ్, సాంకేతిక విద్యా సంస్థల నుంచి బయటకు వస్తున్న విద్యార్థుల విజయానికి కొలమానాలు’ అని రాష్టప్రతి ఉద్బోధించారు.