అంతర్జాతీయం

మరింతగా మైత్రీ బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వియన్‌టియాన్, సెప్టెంబర్ 7: ఉగ్రవాద నిరోధన, పౌర అణు ఇంధన సహకారం, వ్యాపార వాణిజ్య సహకారం విస్తృత స్థాయిలో సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, జపాన్‌లు నిర్ణయించాయి. ఆసియాన్ ఇండియా, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని షింజో అబేతో దాదాపు 45 నిముషాల పాటు చర్చలు జరిపారు. ఉగ్రవాదం నిర్మూలనకు మరింతగా సహకరించుకోవాలని అలా గే పౌర అణు ఇంధన సహకారాన్ని కూడా విస్తృతం చేసుకోవాలని ఈసమావేశం సందర్భంగా ఉభయ దేశాల ప్రధానులు నిర్ణయించుకున్నారని విదేశీ వ్యవహారాల ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఇక్కడి జాతీయ కనె్వన్షన్ కేంద్రంలో సమావేశమైన మోదీ, షింజోలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై కూడా చర్చించినట్టు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అన్ని విధాలుగా అణచివేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈ విషయంలో భారత్‌కు అన్ని విధాలుగా సహకరిస్తామని జపాన్ ప్రధాని తెలిపారు. వ్యాపార, వాణిజ్య సంబంధాలను కొత్త పుంతలను తొక్కించాల్సిన అవసరం కూడా ఎంతో ఉందని ఆ దిశగా చర్యలు చేపట్టాలని కూడా ఇరువురు నేతలు సంకల్పించారు. అలాగే ఇరుదేశాల మధ్యా కుదురిన పౌర అణు ఇంధన సహకార ఒప్పందం చర్చల తీరుపై కూడా సమీక్ష జరిపారు. హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. సాంకేతిక, ఆధునీకరణ, వౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యం నిర్మాణం వంటి అంశాల్లో జపాన్ నుంచి అందుతున్న సహకారం పట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

జపాన్ ప్రధాని షింజో అబేతో ప్రధాని నరేంద్ర మోదీ కరచాలనం