జాతీయ వార్తలు

ఆప్ బహిష్కృత మంత్రి సందీప్‌కు 14 రోజుల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: సెక్స్ సీడీల కేసులో అరెస్టయిన ఆప్ బహిష్కృత మంత్రి సందీప్ కుమార్‌కు కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. ఓ మహిళ దాఖలు చేసిన అత్యాచారం కేసులో కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కస్టోడియల్ ఇంటాగేషన్ అవసరం లేదంటూ ఢిల్లీ పోలీసులు చెప్పడంతో 36 ఏళ్ల సందీప్‌కుమార్‌ను ఈనెల 23 వరకూ జుడీషియల్ రిమాండ్‌కు పంపుతూ ప్రత్యేక న్యాయమూర్తి పూనం చౌదరీ ఆదేశించారు. ఒక రోజు పోలీసు రిమాండ్ గడువుముగిసిపోవడంతో ఆప్ ఆయనను ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అశ్లీల చిత్రాలు చిత్రీకరించేందుకు సందీప్ ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకోడానికి పోలీసులు ప్రయత్నించారు.ఇలా ఉండగా నిందితుడి తరఫున కోర్టుకు హాజరైన అడ్వొకేట్ ప్రదీప్ రాణా తన క్లయింట్‌కు ప్రాణహాని ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో కుమార్‌కు ప్రాణహాని ఉందని, సాయుధ పోలీసుల భద్రతతో ప్రత్యేక సెల్‌ను కేటాయించాలని ఆయన కోరారు.