ఆంధ్రప్రదేశ్‌

ప్యాకేజీ గ్రేట్! నా మాట నమ్మండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ప్రత్యేక హోదా సెంటిమెంట్ కాదని, ఇందులో ఎకనామిక్స్ ఉందని, తెలంగాణ ఉద్యమంలో సెంటిమెం ట్ ఉందని, ఎకనామిక్స్ లేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. హోదా కంటే ప్యాకేజీ వల్ల రాష్ట్రం లో మంచి అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రత్యేక ప్యాకేజీని ఏడాదిన్నర క్రితం తెచ్చి ఉంటే బాగుండేదని, ఆలస్యమైందని ఆయన అన్నా రు. ఆదివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ హోదాపై ప్రజలను తప్పుదోవబట్టించే విధంగా రాజకీయ పార్టీలు ప్రకటనలు చేయరాదన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన రోజు చరిత్రలో అద్భుతమైన రోజుగా నిలిచిపోతుందన్నారు. ప్యాకేజీలో పొందుపరిచిన అంశాలకు చట్టబద్ధత కల్పిస్తామని, త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే 10 నుంచి 15 సంవత్సరాల్లో ప్యాకేజీ నిధులతో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో మంచి అభివృద్ధి జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లో మాదిరిగా హెచ్‌ఎంటి సంస్ధలు ఆంధ్రాలో రావాలంటే ఎలా సాధ్యమవుతుందని, హెచ్‌ఎంటి సంస్ధలు మూతపడిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. వైద్యుడు 500 ఎంజి టాబ్లెట్లు రాస్తే, మెడికల్ షాపుకు వెళతాం. అక్కడ 500 ఎంజి టాబ్లెట్లు లేవు. 250 ఎంజి టాబ్లెట్లు రెండు తీసుకోండి అని అంటే తీసుకోమా అని సుజనా చౌదరి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. వేరే నేతల మాటలపై తాను మాట్లాడడం బాగుండదన్నారు.