జాతీయ వార్తలు

రాజీనామా చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: డిడిసిఏలో జరిగిన అవినీతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ సభ్యులు మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యలు చేసిన గొడవ మూలంగా రాజ్యసభ మంగళవారం ఉదయం జీరో అవర్‌లో రెండు సార్లు, ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో రెండు సార్లు వాయిదా పడింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం కాంగ్రెస్ సభ్యులు ఎంత గొడవ చేసినా సభను వాయిదా వేసేందుకు నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగినంత సేపూ పోడియం వద్ద నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తునే ఉన్నారు. సభా కార్యక్రమాలను స్తంభింపచేసేందుకు ప్రయత్నించారు. సుమిత్ర మహాజన్ కాంగ్రెస్ సభ్యులు గొడవ మధ్యనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తరువాత ఆమె ప్రభుత్వ పత్రాలను సభ ముందు ప్రతిపాదింపచేశారు. అనంతరం జీరో అవర్‌లో వాయిదా తీర్మానాలు ప్రతిపాదించిన వారికి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. దీనిని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ గట్టిగా వ్యతిరేకించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగినంత సేపు గొడవ చేసి సభను గందరగోళంలో పడేసిన కాంగ్రెస్ నాయకులకు మాట్లాడే అవకాశం ఎలా ఇస్తారంటూ ఆయన స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను అడిగారు. సభను స్తంభింపజేసేందుకు ప్రయత్నించిన వారికి వారికి అవకాశం ఇవ్వకూడదని ఆయన వాదించారు. దీంతో సభలోకొంత సేపుగందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తాము మాట్లాడకుండా మంత్రి అడ్డుతగులు తున్నారని కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయటంతో సభలో వాతావరణం సద్దుమణిగింది. ఇదిలా ఉంటే రాజ్యసభ మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి పెద్ద ఎత్తున గొడవ చేశారు. డిడిసిఏ కుంభకోణంలో ఇరుక్కున్న అరుణ్‌జైట్లీ రాజీనామా చేయాలని వారు నినాదాలు చేయడంతో సభ దద్దరిల్లిపోయింది. కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కూడా పోడియం వద్దకు వచ్చి గొడవ చేశారు. జైట్లీ రాజీనామా చేయవలసిందేనంటూ వారు నినాదాలు ఇవ్వడంతో రాజ్యసభ అట్టుడికిపోయింది. హమీద్ అన్సారీ సభను మళ్లీ రెండు సార్లు వాయిదా వేశారు. రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటల తరువాత సజావుగా కొనసాగింది.