జాతీయ వార్తలు

జైట్లీకి మోదీ బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: హవాలా ఆరోపణలను ఎదుర్కొన్న ఎల్‌కె అద్వానీ బయటపడినట్లే డిడిసిఏ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా బైట పడతారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మోదీ మంగళవారం బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అరుణ్ జైట్లీని గట్టిగా వెనకేసుకు వచ్చారు. గతంలో అద్వానీని హవాలా కుంభకోణంలో ఇరికించేందుకు కాంగ్రెస్ ఎంతో ప్రయత్నించి విఫలమైందని, ఇదే విధంగా ఇప్పుడు అరుణ్ జైట్లీని ఢిల్లీ క్రికెట్ సంఘం కుంభకోణంలో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని మోదీ అభిప్రాయపడ్డారు. అద్వానీ మాదిరిగానే జైట్లీ కూడా ఈ ఆరోపణల నుండి సురక్షితంగా బైటికి వస్తారన్నారు. జైట్లీ ఎలాంటి తప్పు చేయలేదని మోదీ స్పష్టం చేయటం గమనార్హం. ఆయన కాంగ్రెస్‌పై కూడా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఒక పథకం ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర పన్నుతోందని ప్రధాని దుయ్యబట్టారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలను తయారు చేసి ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. బిజెపి పార్లమెంటటరీ పార్టీ సమావేశం చర్చల వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పత్రికలకు వివరించారు.
అరుణ్‌జైట్లీని మోదీ పూర్తిస్థాయిలో సమర్థించటం బిజెపిలో చర్చనీయాంశంగా తయారైంది. డిడిసిఏ కుంభకోణంపై వివాదం ప్రారంభమైన తరువాత ప్రధాని ఈరోజు మొదటిసారి దానిపై మాట్లాడారు. జైట్లీ నీతి, నిజాయితీ గురించి అందరికీ తెలుసు. ఆయన నిజాయితీ గురించి ఎవ్వరికీ ఎలాంటి సంశయం లేదని మోదీ తెలిపారు. జైట్లీపై ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, అవి పూర్తిగా నిరాధారమైనవని ప్రధాని స్పష్టం చేశారు. డిడిసిఏ అవినీతి గురించి దర్యాప్తు జరిపేందుకు ఢిల్లీ ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేయటంపై కూడా బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ జరిగింది. డిడిసిఏ అవినీతిపై దర్యాప్తు చేయించటం అంటే అరుణ్ జైట్లీపై విచారణ జరిపించటమేననేది అందరికీ తెలిసిందే. జైట్లీ పదమూడు సంవత్సరాల పాటు డిడిసిఏ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు జరిగినట్లు చెబుతున్న అవినీతి గురించి దర్యాప్తు జరపటం దర్యాప్తుకమిషన్ ప్రధాన బాధ్యత. మోదీ అరుణ్ జైట్లీని సమర్థిస్తున్నప్పుడు ఆయనపై అవినీతి ఆరోపణలు చేసిన బిజెపి బిహార్ ఎంపి కీర్తి ఆజాద్ సమావేశంలో లేరు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే ఆజాద్‌పై వేటు పడుతుందని చెబుతున్న నేపథ్యంలో ఆజాద్ హాజరు కాకపోవటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఐదుగురు నాయకులపై జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం దావాను పలువురు ఎంపీలు సమర్థించారు.
ఇదిలా ఉంటే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే పార్టీ ఎంపీలు తమ నియోజకవర్గాలకు వెళ్లి మోదీ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తారని వెంకయ్యనాయుడు తెలిపారు. కాంగ్రెస్ గొడవ చేయటం వల్లనే జువనైల్ జస్టిస్ బిల్లును రాజ్యసభలో ఆమోదించలేకపోయారని ఆయన వాపోయారు. డిసెంబర్ 25 తేదీనాడు సుపరిపాలన దినంగా జరుపుకోవాలని మోదీ బిజెపి సభ్యులకు పిలుపు ఇచ్చారు.

చిత్రం... ఢిల్లీలో మంగళవారం జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ, సీనియర్ నాయకులు అద్వానీ, జైట్లీ, వెంకయ్యనాయుడు