జాతీయ వార్తలు

మల్కాజ్‌గిరిలో నైపుణ్య కేంద్రం పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలోని అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు సిహెచ్ మల్లారెడ్డి డిమాండ్ చేశారు. మల్లారెడ్డి మంగళవారం లోక్‌సభలో 377 నిబంధన కింద ఇచ్చిన నోటీసుపై మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు. 30 లక్షల మంది ఓటర్లు ఉన్న లోక్‌సభ నియోజకవర్గంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆయన సూచించారు. నైపుణ్య అభివృద్ధి కేంద్రం, కంప్యూటర్ శిక్షణా సంస్థను ఏర్పాటు చేయటం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరుకుంటున్న డిజిటర్ ఇండియాను సాధించాలని మల్లారెడ్డి సూచించారు. డిజిటల్ ఇండియాతో ఎన్నో ప్రయోజనాలు వొనగూరుతాయి. కాగితం రహిత, నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చని మల్లారెడ్డి చెప్పారు. ప్రతి జిల్లాలో కంప్యూటర్ శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.