జాతీయ వార్తలు

ప్రత్యేక సాయంపై పరిశీలిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22:తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం చేసే విషయం పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె కేశవరావు, లోక్‌సభ సభ్యుడు బి వినోద్‌కుమార్ మంగళవారం జైట్లీని కలిసి రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం చేయటం గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన జిల్లాలకు ఒక్కొక్క దానికి యాభై కోట్ల రూపాయల చొప్పున ఇవ్వటం గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి సహాయమే తెలంగాణకు కూడా చేయాలని ఇరువురు నాయకులు కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రెండు రాష్ట్రాలలోని వెనుకబడిన జిల్లాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయం చేయాలి, ఆంధ్రప్రదేశ్‌కు ఇది వరకే ఈ సహాయం అందజేసినందున ఇప్పుడు తెలంగాణాలోని వెనుకబడిన జిల్లాల అభివృద్దికి ప్రత్యేక ఆర్థిక సహాయం చేయాలని కేశవరావు, వినోద్‌కుమార్ కోరారు. తెలంగాణాలోని పలు జిల్లాలు ఎంతో వెనకుబడి ఉన్నాయి, వీటిని కూడా అభివృద్ది చేయవలసిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని వారు అరుణ్ జైట్లీతో చెప్పారు. జైట్లీ వారు చెప్పినదంతా సావకాశంగా విన్న తరువాత తెలంగాణాకు చేయవలసినంత సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్టప్రతి ఉత్తర్వుల
సవరణ అంశంపై పరిశీలన
తెలంగాణలో నివాసం ఉండి విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనుకునే వారి ప్రయోజనాలను కాపాడేందుకు లోకల్ క్యాండిడేట్ స్టేటస్, విద్య, ఉద్యోగం తదితర విషయాల్లో ఇబ్బందులు ఉండకుండా చేసేందుకు 1974 రాష్టప్రతి ఉత్తర్వుల్లోని నాలుగో పేరా, పేరా ఏడును సవరించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాసిన లేఖ కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నదని హోం శాఖ సహాయ మంత్రి హరీభాయ్ పార్త్భీయ్ చౌదరి వెల్లడించారు. తెలుగుదేశం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి సభ్యుడు అవినాష్‌రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు మంత్రి మంగళవారం బదులిచ్చారు. 371లోని డిని రద్దు చేయాలన్న ప్రతిపాదన ఏదీ రాష్ట్రం నుండి రాలేదని ఆయన మరో ప్రశ్నకు బదులుగా తెలిపారు.