జాతీయ వార్తలు

నేనున్నంత వరకు పార్టీ చీలదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 16: సమాజ్‌వాదీ పార్టీలో అంతఃకలహాలపై ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తొలిసారి పెదవి విప్పారు. తాను ఉన్నంత వరకు పార్టీ చీలిపోయే సమస్యే లేదని ఆయన పేర్కొన్నారు. ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ సింగ్ యా దవ్ గురువారం నాటకీయంగా రాష్ట్ర కేబినెట్ పదవితో పాటు పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేయడంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో ములాయం సిం గ్ శుక్రవారం ఇక్కడ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తన కుమారుడయిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన మాట కాదనరని పేర్కొం టూ తొలగించిన గనుల శాఖ మంత్రి గాయత్రి ప్రజాపతిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రకటించారు. అఖిలేష్, శివపాల్‌లకు మధ్య వివాదానికి ప్రజాపతిని మంత్రివర్గం నుంచి తొలగించడమే కారణమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తన సోదరుడు, కుమారుడి మధ్య నెలకొన్న విభేదాలను తొలగించడానికి మధ్యవర్తిత్వం నెరపుతున్న ములాయం సింగ్ ‘నేనున్నంత వరకు పార్టీలో చీలిక సంభవించదు’ అని అన్నారు. ‘మాది పెద్ద కుటుంబం. భేదాభిప్రాయాలు రావొ చ్చు.. అయితే శివపాల్, అఖిలేష్‌ల మ ధ్య ఎలాంటి పోరు లేదు’ అని ఆయన పేర్కొన్నారు. అఖిలేష్ శివపాల్‌ను అతని నివాసంలో కలుస్తారని కూడా ములాయం చెప్పారు. ఇది ఎన్నికల సమయమని, ఐకమత్యంతో పనిచేయడానికి అంతా ఒక్కటి కావాలని ఎస్‌పి అధినేత పిలుపునిచ్చారు. ‘రాంగోపాల్, అఖిలేష్, శివపాల్‌ల మధ్య ఎలాంటి పోరు లేదు’ అని ములాయం సింగ్ విలేఖరులకు చెప్పారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో పార్టీ కార్యకర్తలు శివపాల్ యాదవ్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తీవ్ర స్థాయిలో నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల త్వరలో జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ భవితవ్యంపై నీలినీడలు అలుముకున్నాయి. అయితే ములా యం సింగ్ మాత్రం ఈ పరిణామాల తీవ్రతను తగ్గించి చూపడానికి ప్రయత్నించారు. ‘ప్రతి తండ్రీ కొడుకులు సమస్యలను ఎదుర్కొంటారు.. అయి తే ఇక్కడ ఎలాంటి కలహాలు లేవు’ అని ములాయం సింగ్ వ్యాఖ్యానించారు. అయితే తమ పార్టీ నాయకులు కొందరు మీడియాతో మాట్లాడటం తప్పని ఆయన పేర్కొన్నారు. పార్టీలో కలహాలు ఉన్నాయనే గందరగోళాన్ని కొంతమంది సృష్టించారని ఆయన అన్నారు. ‘సమాజ్‌వాదీ పార్టీ ఒక కుటుంబం. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు’ అని ఆయన అన్నారు. పదవీచ్యుతుడయిన ప్రజాపతిని ములాయం సమర్థించారు. అతడిని మంత్రి పదవినుంచి తొలగిస్తూ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయడం జరుగుతుందని చెప్పారు. అంతకుముందు శివపాల్ తన ని వాసం వెలుపల గుమికూడిన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను ములాయంతో పాటే ఉన్నానని ప్రకటించారు. ‘మనమంతా కలిసి పార్టీని బలోపేతం చేయవలసి ఉంది. మనం నేతాజీ (ములాయం)తో ఉ న్నాం. అతని సందేశమే మనకు ఆ దేశం. మనం బయటకు వెళ్లి పార్టీని బలహీనపరచబోము. ప్రతి సందర్భంలోనూ మనం నేతాజీతో ఉంటాం’ అని శివపాల్ తనకు అనుకూలంగా నిదాలిస్తున్న మద్దతుదారులను ఉద్దేశించి అన్నారు.
గురువారం రాత్రి నుంచే పెద్ద ఎత్తున మద్దతుదారులు శివపాల్ నివాసానికి రావడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు శివపాల్ నివాసానికి వచ్చారు. ప్రజాపతి కూడా శివపాల్‌ను కలుసుకున్నారు. విభేదాలను తొలగించడానికి అసెంబ్లీ స్పీకర్ మాతా ప్రసాద్ పాండే కూడా శుక్రవారం ఉదయం శివపాల్ నివాసానికి చేరుకొని చర్చలు జరిపారు.

లక్నోలో శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న అధికార సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్..
శివపాల్ యాదవ్‌కు మద్దతుగా లక్నోలో ప్రదర్శన జరిపిన పార్టీ కార్యకర్తలు