జాతీయ వార్తలు

ఈ గందరగోళానికి కారకులు మీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, సెప్టెంబర్ 19: పాకిస్తాన్ విషయంలో భారత విధానం పూర్తి గందరగోళంగా తయారవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే పూర్తి బాధ్యుడని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి విషయంలో ఇంటెలిజన్స్ పరంగాను, సైనిక చర్యపరంగాను ఘోర వైఫల్యానికిగాను దమ్ముంటే రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌పై చర్య తీసుకోవాలని సవాలు చేసింది. యూరి ఉగ్రవాద దాడికి పథక రచన చేసింది, అమలు జరిపింది పాకిస్తానేనని ఆ పార్టీ అంటూ, మోదీ ప్రభుత్వ నాయకత్వ వైఫల్యం ఫలితంగానే ఈ దాడి జరిగిందని ఇంటెలిజన్స్ పరంగాను, దాడిని తిప్పికొట్టే విషయంలో పెద్దఎత్తున ప్రభుత్వం వైఫల్యం ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయని కాంగ్రెస్ మీడియా ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా అన్నారు. ఈ ఘోర వైఫల్యానికి బాధ్యులను, జవాబుదారులను గుర్తించడం ద్వారా తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన ప్రదాని మోదీని డిమాండ్ చేశారు. ‘రెండేళ్లుగా భారత సరిహద్దులు, జాతీయ భద్రత ముట్టడిలో ఉన్నాయి. రక్షణ మంత్రి దీనికి బాధ్యత వహించాలి’ అని అంతకుముందు ఆయన ఒక ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. సైనిక స్థావరంపై దాడి మన భారతీయ అంతరాత్మపై జరిగిన దాడి అని, దాడులకు బాధ్యులైన వారిని వీలయినంత త్వరగా శిక్షించాలని ఆయన ఆదివారం అన్నారు.
పాకిస్తాన్ విషయంలో ప్రభుత్వ విధానాన్ని ఆయన దుయ్యబడుతూ, అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లను పెంచి పోషిస్తున్న, ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంలో ఒక భాగంగా ఉపయోగించుకుంటున్న పాకిస్తాన్‌పై సమగ్రమైన ఆంక్షలు విధించాలని మోదీ ప్రభుత్వం ప్రపంచ దేశాలను కోరాలని అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘పాకిస్తాన్‌కు ప్రేమలేఖలు రాయడం మానుకోవాలి’ అని అంటూ ప్రతిరోజూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహాలిచ్చేవారని, అంతేకాదు, తనకు 56 ఇంచ్‌ల ఛాతీ ఉందని, ఒక తలకు బదులుగా పది తలలు తీసుకువస్తానని పదే పదే గొప్పలు చెప్పుకోవడమే కాకుండా పాకిస్తాన్‌కు దాని భాషలోనే సమాధానం చెప్పాలని కూడా ప్రభుత్వానికి సలహా ఇచ్చేవారని, ఇప్పుడు మోదీకి ఆయన మాటలన్నిటినీ మరోసారి గుర్తుచేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ దేశ ప్రధాని అయినప్పటినుంచీ మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ బర్త్‌డే పార్టీలు, వెడ్డింగ్ పార్టీలకు హాజరు కావడానికి తరచూ పాకిస్తాన్ సందర్శిస్తున్నారని సుర్జేవాలా అన్నారు. ‘పాకిస్తాన్ విషయంలో ప్రభుత్వ విధానం, వాస్తవ దృష్టితో, నిర్ణయాత్మకంగా ఉండడానికి బదులు పూర్తి గందరగోళంగా ఉందనేది వాస్తవం’ అని ఆయన అన్నారు. దీనికి మోదీ ఒక్కరే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు.