జాతీయ వార్తలు

క్రీమీలేయర్ విధానానికి స్వస్తి చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ అధికారాలను పెంచటంతోపాటు క్రీమీలేయర్ విధానాన్ని తొలగించాలని రాజ్యసభ సభ్యుడు, వెనుకబడిన కులాల పార్లమెంటు సభ్యుల సంఘం కన్వీనర్ వి.హనుమంతరావు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. హనుమంతరావు ఈమేరకు ప్రధానమంత్రికి బుధవారం లేఖ రాశారు. 27 శాతం రిజర్వేషన్లు వెనుకబడిన కులాల వారికి అందాలంటే తాము కోరిన విధంగా చేయాలని హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఎన్‌సిబిసికి ఆధికారాలు లేకపోవటం వలన బిసి రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయించలేకపోతున్నామని ఆయన తెలిపారు. ఎన్‌సిబిసి అధికారాలు పెంచటంతోపాటు క్రీమిలేయర్ విధానాన్ని తొలగించటం వలన దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న బిసిలకు న్యాయం జరుగుతుందని ఆయన ప్రధానికి రాసిన లేఖలో వివరించారు.

గుండు సుధారాణి
సభ్యత్వాన్ని రద్దు చేయండి

రాజ్యసభ చైర్మన్‌కు టిడిపిపి లేఖ

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరటం ద్వారా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన గుండు సుధారాణి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీకి బుధవారం లేఖ రాశారు. సుధారాణి తెలుగుదేశం టికెట్‌పై రాజ్యసభకు గెలిచి, రాజకీయ లబ్ది కోసం టిఆర్‌ఎస్‌లో చేరారని సుజనా చౌదరి విమర్శించారు. గుండు సుధారాణి ఇటీవల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిసి ఆ పార్టీలో చేరటం గురించి చర్చించటం తెలిసిందే.

మోదీ స్థానంలో ఉంటే
జైట్లీని తప్పించేవాడిని
ప్రధాని వైఖరిపై కేజ్రీవాల్ ధ్వజం

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఏ)లో జరిగిన అవకతవకల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. తాను నరేంద్ర మోదీ స్థానంలో ఉండి ఉంటే, ఆరోపణలు వచ్చిన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని మంత్రిమండలి నుంచి తప్పించేవాడిని అని ఆయన బుధవారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాజకీయ నాయకుల నుంచి క్రీడాసంస్థలకు విముక్తి కలిగించాలని, వృత్తిరీత్యా క్రీడాకారులు అయిన వారే క్రీడాసంస్థల పాలకవర్గాలలో ఉండాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు.