జాతీయ వార్తలు

ఇక ఆన్‌లైన్‌లోనే పిఎఫ్ విత్‌డ్రా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: భవిష్యత్ నిధికి సంబంధించిన చందాదారులు లేవనెత్తే అనుమానాలను, సమస్యలను నివృత్తి చేసేందుకు ఉద్యోగుల భవిష్య నిధిసంస్థ (ఇపిఎఫ్‌ఓ) త్వరలోనే ఒక ప్రత్యేక ఆన్‌లైన్ వ్యవస్థను ప్రారంభించనుంది. దీంతో ఇకపై ఉద్యోగుల అనుమానాలను నివృత్తి చేయడానికి కంపెనీ లేదా ఇపిఎఫ్‌ఓ ప్రమేయం అవసరం ఉండదు. ఇపిఎఫ్‌ఓకు చెందిన చాలావరకు సేవలను ఆన్‌లైన్‌ద్వారానే పొందడానికి వీలుగా టెక్నాలజీని సంస్థ అప్‌గ్రేడ్ చేస్తోంది. ఈ సంస్థ రెండు రకాల సాఫ్ట్‌వేర్‌లను- ఒకటి పిఎఫ్‌కు సంబంధించిన వ్యవహారాలకోసం, మరోటి పెన్షన్సకు సంబంధించి- అభివృద్ధి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 123 కేంద్రాలనుంచి డేటాను తరలించే ప్రయత్నాలను ఇఫిఎఫ్‌ఓ ఇప్పటికే ప్రారంభించింది. అలాగే ఢిల్లీలోని సంస్థ కేంద్ర సర్వర్‌తో ఇపిఎఫ్‌ఓకు చెందిన అన్ని ప్రాంతీయ కార్యాలయాలను అనుసంధానం చేయడానికి ప్రయత్నాలు చేపడుతోంది.