జాతీయ వార్తలు

కుమారునితో కలిసి బన్సల్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: అవినీతి ఆరోపణల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న కార్పొరేట్ వ్యవహారాల శాఖ మాజీ డైరెక్టర్ బికె బన్సల్ తన కుమారుడితో కలిసి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పు ఢిల్లీలోని నీలకంఠ్ అపార్ట్‌మెంట్‌లోని నివాసంలో వారు ఈ దారుణానికి ఒడిగట్డారు. బన్సల్, ఆయన కుమారుడు సొంత ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. కాగా బన్సల్ అవినీతి మొత్తం కుటుంబానే్న బలితీసుకుంది. జూలై నెలలో బన్సల్ భార్య సత్యబాల (57), కుమార్తె నేహా (27) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం పొందారు. సిబిఐ దాడులు తమను మానసికంగా కుంగదీశాయని, అవమానం భారంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఇద్దరూ వేర్వేరు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. తమ మృతికి ఎవరూ కారణం కాదని మరణ వాంగ్మూలంలో తెలిపారు. కాగా బన్సల్, ఆయన కుమారుడు అపార్ట్‌మెంట్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం వారిద్దరి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేసిన బన్సల్‌ను జూలై 16 సిబిఐ అరెస్టు చేసింది. ఓ ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి లంచం తీసుకుంటూ ఆయన పట్టుబడ్డారు. బన్సల్‌కు సంబంధించి ఏడు ప్రాంతాల్లో సోదాలు జరిపిన సిబిఐ నగదు, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన బన్సల్ తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు. బికె బన్సల్, ఆయన కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని, మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పనిమనిషి వారి మృతదేహాలను కనుగొన్నట్టు పోలీసులు తెలిపారు. తండ్రీ కొడుకులు వేర్వేరుగా రాసిన సూసైడ్ నోట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.