జాతీయ వార్తలు

మళ్లీ ఆగిన కావేరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/బెంగళూరు, సెప్టెంబర్ 28: తమిళనాడుకు బుధవారం నుంచి రోజుకు ఆరు వేల క్యూసెక్కుల చొప్పున శుక్రవారం వరకూ కావేరీ జలాలను అందించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశం అమలును కర్నాటక గురువారం వరకూ వాయిదా వేసింది. రేపు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశం ఫలితాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని కర్నాటక సిఎం సిద్ధరామయ్య వెల్లడించారు. సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో మొదట అఖిల పక్ష సమావేశం, అనంతరం సుదీర్ఘ కేబినెట్ భేటీ జరిగింది. వీటి వివరాలను మీడియాకు వెల్లడించిన ముఖ్యమంత్రి ఢిల్లీలో జరిగే ఇరు రాష్ట్రాల సిఎంల సమావేశంలో వాస్తవ పరిస్థితులను వివరిస్తామన్నారు. కావేరీ పరీవాహక ప్రాంతంలోని నాలుగు రిజర్వాయర్లలో నీటి నిలువ స్థాయి,తమిళనాడుకు నీటిని విడుదల చేయడంలో రాష్ట్రానికి వచ్చే కష్ట నష్టాలనూ కేంద్రం కళ్లకు కడతామన్నారు.4నేను స్వయంగా ఢిల్లీ భేటీకి హాజరు అవుతా..మా వాదనను గట్టిగానే వినిపిస్తా..2నని చెప్పిన సిద్ధరామయ్య అంతిమ ఫలితం ఎలా ఉంటుందన్న దానిపైనే తమ తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయన్నారు. అవసరమైతే మళ్లీ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరుస్తామని, అఖిల పక్ష సమావేశాన్నీ ఏర్పాటు చేస్తామని అన్నారు. మూడు రోజుల పాటు కావేరీ జలాలను తమిళనాడుకు ఇచ్చితీరాల్సిందేనని చెప్పిన సుప్రీం ఈ ప్రతిష్ఠంభనను తొలగించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. బుధవారం నుంచి కావేరీ జలాలను తమిళనాడుకు అందించడంలో ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు ఉండకూడదని కూడా సుప్రీం తన తీర్పులో స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసినప్పుడు ఆ విషయం మాకు తెలుసు. అయితే అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని, అఖిల పక్ష భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది2అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాన్ని ధిక్కరించాలన్న ఆలోచన తమకు ఏకోశానా లేదని, కానీ ఆ తీర్పును అమలు చేయడానికి ముందు తమ ఇబ్బందుల్ని పరిగణించడం అవసరమని అన్నారు.