జాతీయ వార్తలు

సార్క్ సదస్సు రద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ఉరీ సైనిక శిబిరంపై ఇస్లామిక్ ఉగ్రవాదులతో దాడి చేయించిన పాకిస్తాన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో నవంబర్‌లో జరుగవలసిన సార్క్ శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేయించటం ద్వారా అంతర్జాతీయంగా పెద్ద షాక్ ఇచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఏర్పాటు చేసిన సార్క్ శిఖరాగ్ర సమావేశానికి రావటం సాధ్యం కాదని నరేంద్ర మోదీతోపాటు బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్తాన్ ప్రకటించటంతో 2016 సార్క్ శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేయాలని సార్క్ ప్రస్తుత అధ్యక్ష దేశం నేపాల్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ఏడాది నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరుగవలసిన సార్క్ శిఖరాగ్ర సమావేశం రద్దుకు సంబంధించిన అధికారిక ప్రకటనను నేపాల్ ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేస్తుందని దౌత్యవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న ప్రస్తుత సార్క్ సెక్రటరీ జనరల్ అర్జున్ బహదూర్ థాపా రెండు రోజుల్లో స్వదేశం తిరిగి వస్తారని, ఆయన ఈ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా, సార్క్ శిఖరాగ్ర సమావేశంలో భారత్ పాల్గొనబోదనే విషయాన్ని భారత విదేశాంగ శాఖ ట్వీట్ ద్వారా తమకు తెలిసిందని పాక్ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి నఫీజ్ జకరియా అంటూ, ఈ నిర్ణయం దురదృష్టకరమన్నారు. ప్రాంతీయ శాంతికి పాక్ కట్టుబడి ఉందనిఈ ప్రాంత ప్రజల విస్తృత ప్రయోజనం కోసం కృషి చేస్తూనే ఉంటుందని ఆయన అన్నారు.
సార్క్‌లో ఎనిమిది సభ్యదేశాలుండగా నాలుగు దేశాలు, భారత్, బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్తాన్‌లు ఇస్లామాబాద్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాలేమని సార్క్ ప్రస్తుత అధ్యక్ష దేశం నేపాల్‌కు తెలియజేశాయి. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను పెంచి, పోషించటంతో పాటు సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోందని భారత దేశం ఆరోపించింది. పాక్ తమ దేశ అంతర్గాత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్‌లు ఆరోపించాయి. భూటాన్ కూడా దాదాపుగా ఇలాంటి ఆరోపణే చేసింది. సార్క్ సభ్యదేశాలు ఎనిమిది ఉంటే అందులో నాలుగు దేశాలు గైరుహాజరయితే శిఖరాగ్ర సమావేశం ఎలా నిర్వహిస్తామని నేపాల్ దౌత్యవర్గాలు చెబుతున్నాయి. ఇస్లామాబాద్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్ని సభ్య దేశాలకు అభ్యంతరం ఉంటే మరో సభ్య దేశంలో శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉండిందని, అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి పరిశీలించకుండానే గైర్హాజరు కావాలని నాలుగు సభ్య దేశాలు నిర్ణయించుకుంటే శిఖరాగ్ర సమావేశం ఎలా జరుగుతుందని నేపాల్ దౌత్యవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సార్క్ సభ్య దేశాల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించుకోవటమే శిఖరాగ్ర సమావేశం ప్రధాన లక్ష్యం అయితే చర్చలకు హాజరయ్యేందుకు కొన్ని సభ్య దేశాలు నిర్ణయించుకోవటం వలన సమావేశం జరపటం ఎంత మాత్రం సాధ్యం కాదని నేపాల్ దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే ఇస్లామాబాద్ సమావేశానికి హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై తమ దేశం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నేపాల్ దౌత్య వర్గాలు తెలిపాయి. నేపాల్ ప్రస్తుతం సార్క్ దేశాల కూటమికి అధ్యక్షత వహిస్తున్నందున ఏదోఒక నిర్ణయం తీసుకోవటం సాధ్యం కాదని వారంటున్నారు.
ఇస్లామిక్ ఉగ్రవాదులు జమ్మూ,కాశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై దాడి చేసి 18 సైనికులను పొట్టన పెట్టుకున్నప్పటి నుండి పాక్‌ను ఏకాకి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. నీరు,నెత్తురు కలిసి ప్రవహించలేవంటూ సింధూ జల ఒప్పందాన్ని పునఃపరిశీలిస్తున్న మోదీ పాక్‌కు కల్పించిన ‘అత్యంత సానుకూల దేశం’ హోదాను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే ఎన్డీఏ ప్రభుత్వం మిత్ర దేశాలైన బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, భూటాన్‌లతో చర్చించి ఇస్లామాబాద్‌లో నవంబర్‌లో ఏర్పాటు చేసిన సార్క్ శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఏకాకిని చేసే మొదటి చర్యగానే సార్క్ శిఖరాగ్ర సమావేశం జరకుండా చూశారని అంటున్నారు. నరేంద్ర మోదీ అవలంబిస్తున్న ఈ వ్యూహం మూలంగా ఇస్లామాబాద్‌లో జరుగవలసిన సమావేశం రద్దు కావటంతోపాటు పాక్‌కు సార్క్ అధ్యక్ష స్థానం లభించకుండా చేయగలిగారు. ఇస్లామాబాద్‌లో జరిగే సమావేశంలో సార్క్ అధ్యక్ష స్థానం నేపాల్ నుండి పాకిస్తాన్‌కు మారవలసి ఉన్నది. ఇప్పుడు ఈ సమావేశం రద్దైతే పాక్‌కు రెండు విధాల నష్టం కలుగుతుంది. ఇదిలా ఉంటే ఇస్లామాబాద్ సమావేశం రద్దయిన అనంతరం ఇకమీదట సార్క్ శిఖరాగ్ర సమావేశాలు జరగకపోవచ్చునని అంచనా వేస్తున్నారు.