జాతీయ వార్తలు
భారతీయతే ఏకైక మతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, నవంబర్ 27: తమ ప్రభుత్వానికి భారతీయతే ఏకైక మతమని, రాజ్యాంగమే ఏకైక పవిత్ర గ్రంథమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలోని అన్ని మతాలు, వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు నిబద్ధతతో కృషి చేస్తామన్నారు. దేశంలో మత అసహన ధోరణులు పెచ్చరిల్లిపోతున్నాయన్న విమర్శల నేపథ్యంలో లోక్సభలో భారత రాజ్యాంగ పీఠికపై జరిగిన రెండు రోజుల చర్చ ముగింపు సందర్భంగా శుక్రవారం నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు అత్యధిక ప్రాధాన్యత లభించింది. అలాగే మెజార్టీ అభిప్రాయాన్ని, నిర్ణయాలను ఏకపక్షంగా రుద్దే ప్రసక్తి లేదంటూ విపక్షాలకు ఏకాభిప్రాయ సాధన సంకేతాలను అందించారు. రాజ్యాంగాన్ని సమీక్షించే ప్రసక్తిలేదని స్పష్టం చేసిన మోదీ ‘మెజార్టీ నిర్ణయాలను రుద్దాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. ఏకాభిప్రాయ సాధనే ధ్యేయంగా, సంప్రదింపుల ప్రక్రియే మార్గంగా ముందుకు వెళతాం’ అని స్పష్టం చేశారు. రెండు రోజులపాటు సభలో జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన మోదీ అనేక అంశాలను ప్రస్తావించారు. స్వతంత్య్ర భారత తొలి ప్రధాని నెహ్రూవంటి నేతల ప్రాధాన్యతను తమ ప్రభుత్వం విస్మరిస్తోందంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణను తిరస్కరించారు. భిన్నత్వంలో ఏకత్వ భావనే భారత దేశానికి తిరుగులేని శక్తి అని పేర్కొన్న మోదీ, ఈ ఉదాత్త ఆదర్శాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. మత అసహన ధోరణులపై విపక్షాలు దుమ్మెత్తి పోయడం, తన వౌనాన్ని ప్రశ్నించినప్పటికీ ప్రధాని మోదీ వీటి గురించి ఎక్కడా తన సుదీర్ఘ ప్రసంగంలో ప్రస్తావించలేదు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలకు స్వస్తిపలికే రీతిలో విపక్షాలతో సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ తెలిపారు. జిఎస్టి సహా అనేక కీలక బిల్లులు పార్లమెంట్లో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఏకాభిప్రాయమే సమస్యల పరిష్కార మార్గమంటూ పిలుపునివ్వడం గమనార్హం. లోక్సభలో ప్రతిపక్ష నేత సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లను తేనీటి విందుకు ఆహ్వానించడాన్ని ఇందుకు సంకేతంగా చెబుతున్నారు.
చిత్రం.. భారత రాజ్యాంగ పీఠికపై లోక్సభలో
శుక్రవారం జరిగిన చర్చకు ముగింపు సమాధానమిస్తున్న నరేంద్ర మోదీ