జాతీయ వార్తలు

రూ.25 లక్షల పరిహారం చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన ఎడమ కాలికి 40 శాతం వైకల్యాన్ని పొంది బాధపడుతున్న ఒక రోగికి రూ.25 లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఒక ప్రైవేటు ఆసుపత్రిని, అందులో పనిచేస్తున్న ఇద్దరు ఆర్థోపెడిక్ వైద్యులను ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. లలిత్ సయాల్ అనే రోగికి రూ.15 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఉత్తర ఢిల్లీలోని అశోక్ విహార్ ఫేజ్-3లో గల సుందర్‌లాల్ జైన్ ఆసుపత్రిని, రూ. అయిదు లక్షల చొప్పున చెల్లించాలని చికిత్స చేసిన ఇద్దరు ఆర్థోపెడిక్ వైద్యులను ప్రెసిడెంట్ జస్టిస్ వీణా బిర్దాల్, సభ్యుడు సల్మా నూర్‌తో కూడిన బెంచ్ ఆదేశించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగి గత 23 ఏళ్లుగా చికిత్స పొందాడని, ఇప్పటికీ అతనికి డ్రెస్సింగ్ తరహా చికిత్స అవసరమవుతోందని బెంచ్ పేర్కొంది. దీనివల్ల అతను సంపాదించుకునే అవకాశాన్ని కోల్పోవడమే కాకుండా శాశ్వత అంగవైకల్యాన్ని పొందాడని పేర్కొంది.

మార్కండేయ కట్జూపై
దేశద్రోహం కేసు
పాట్నా, సెప్టెంబర్ 28: సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ దేశ ద్రోహ కేసు నమోదైంది. బిహార్‌ను తీసుకునే పక్షంలో కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించవచ్చంటూ కట్జూ ఆన్‌లైన్‌లో చేసిన వ్యాఖ్యలపై జెడి(యు) ఎమ్మెల్సీ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు దాఖలైంది. తాజాగా జిల్లా కోర్టులో బుధవారం మరో ఫిర్యాదు కూడా కట్జూపై దాఖలైంది. ఐపిసి 124ఎ (దేశద్రోహం) సెక్షన్ కింద కట్జూపై కేసు దాఖలు చేసినట్లు శాస్ర్తీనగర్ పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు.
పాక్ గాయకుడి కచేరీ రద్దు
బెంగళూరు, సెప్టెంబర్ 28: ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో పాకిస్తాన్ గాయకుడు షఫ్‌కత్ అమానత్ అలీ కచేరీ రద్దయింది. శుక్రవారం జరగాల్సిన ఈ కచేరీని తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రద్దుచేస్తున్నట్లు రేడియో మిర్చి గ్రూప్ తెలిపింది. ఇటీవల ఈ కచేరీపై బజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్‌లు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.