జాతీయ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు జయ కానుక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 28: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బుధవారం పండగ బోనస్ ప్రకటించారు. బోనస్‌వల్ల ప్రభుత్వంపై 476 కోట్ల రూపాయల భారం పడుతుంది. మొత్తం 3.67 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని సిఎం వెల్లడించారు. అర్హుడైన ఒక్కొక్క ఉద్యోగికి కనిష్ఠంగా 8,400, గరిష్ఠంగా 16,800 రూపాయల బోనస్ అందుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వ ఉద్యోగులు (పిఎస్‌యు)కు ఇరవై శాతం బోనస్ ప్రకటించారు. అందులో 8.33 శాతం బోనస్, 11.67 శాతం ఎక్స్‌గ్రేషియాగా పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థ, ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్లు, సివిల్ సప్లయి కార్పొరేషన్ ఉద్యోగులకు బోనస్ అందుతుంది.
తమిళనాడు హౌసింగ్ బోర్డు, చెన్నై మెట్రోవాటర్ సప్లయి, సీవరేజెస్ బోర్టు సి, డి సెక్షన్ ఉద్యోగులకు 8.33 శాతం బోనస్, 11.67 శాతం ఎక్స్‌గ్రేషియా అందజేస్తారని జయలలిత తెలిపారు. బోనస్ పథకం పరిధిలోకిరాని కాంట్రాక్టు ఉద్యోగులకు అన్నాడిఎంకె ప్రభుత్వం వరాలు ప్రకటించింది. విద్యుత్ బోర్డులో పనిచేసే ఒప్పంద కార్మికులకు 4వేలు, సివిల్ సప్లయిస్ కాంట్రాక్టు ఉద్యోగికి మూడువేలు బోనస్‌ను సిఎం ప్రకటించారు.

సహకార సంఘాల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది.