జాతీయ వార్తలు

చెక్కుచెదరని నితీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎనలేని ఆసక్తిని కలిగించాయి. కనీసం బిహార్‌లోనైనా విజయం సాధించాలనుకున్న బిజెపికి నితీష్ సారథ్యంలోని మహాకూటమి నుంచి పెను సవాలే ఎదురైంది. జెడియు, ఆర్‌జెడి, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా పోటీచేసి బిహార్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం అధిగమించి నితీష్ కుమార్ మూడింట రెండొంతుల మెజార్టీని సునాయాసంగా కైవసం చేసుకున్నారు. ఆవిధంగా వరుసగా మొడోసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దాణా కుంభకోణంతో రాజకీయంగా కనుమరుగైపోయాడనుకున్న ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ రాజకీయ పునః ప్రవేశానికి ఈ ఎన్నికల విజయం ఆస్కారాన్నిచ్చింది. నరేంద్ర మోదీ అనేక దఫాలుగా రాష్ట్రంలో పర్యటించి హామీలు గుప్పించినా ఏ రకమైన ఫలితం చేకూరలేదు. రాష్ట్ర ఎన్నికల్లో రెండు బలమైన ప్రాంతీయ పార్టీల చేతిలో బిజెపికి ఎదురుదెబ్బే తగిలింది.