జాతీయ వార్తలు

‘గురి’ కుదిర్చిన కార్టోశాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఆక్రమిత పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను గురితప్పకుండా భారత్ సైన్యం మట్టుపెట్టడానికి కార్టోశాట్-2సి ఉపగ్రహం ఎంతగానో ఉపకరించింది. ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగానే పాక్ ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం గుర్తించడం, లక్షిత రీతిలో సర్జికల్ దాడుల ద్వారా ధ్వంసం చేయడం సాధ్యమైంది. ఈ విషయాన్ని ఆలస్యంగానే భారత రక్షణ వివరాల పత్రిక ఆదివారం వెల్లడించింది. ఏ విధంగా చూసినా కార్టోశాట్ అందించిన సేవలు నిరుపమానమని, వాటి ఆధారంగానే సర్జికల్ దాడులను విజయవంతంగా పూర్తిచేయ గలిగామని రక్షణ శాస్తవ్రేత్త రతన్ సింగ్ బిస్త్ తెలిపారు. ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలు ఎక్కడున్నాయన్న విషయాన్ని చాలా స్పష్టమైన ఛాయాచిత్రాలను కార్టోశాట్ 2సి ఇమేజ్ ద్వారా గుర్తించగలిగామని, ఇవి మన సైనికులకు ఎంతగానో ఉపకరించాయని వెల్లడించారు. ఇదే విషయాన్ని ఇస్రో వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఈ ఏడాది జూన్‌లో ప్రయోగించిన కార్టోశాట్ దేశ రక్షణ అవసరాలను విశేషంగా తీరుస్తోంది.
నిఘా, నియంత్రణలకు చెందిన సైనిక సామర్థ్యాన్ని విశేషంగా పెంచింది. ఈ ఉపగ్రహం ఆయా ప్రాంతాల ఛాయాచిత్రాలను తీయడమే గాకుండా, అత్యంత కీలకమైన లక్ష్యాల వీడియోలను కూడా అందించగలుగుతోంది.