ఆంధ్రప్రదేశ్‌

ప్రాజెక్ట్‌ల నిధుల బాధ్యత ‘సంస్థ’లదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 4: ప్రభుత్వ ఆదాయ వనరులు మెరుగు పడలేదు. ప్రభుత్వ ఖజానాపై ఇప్పటికీ లోటు కనిపిస్తునే ఉంది. అయితే, రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాల్సి ఉంది. ప్రజావసరాలను దృష్టిలోపెట్టుకుని కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించాల్సి ఉంది. నిధులు లేవన్న సాకుతో కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టకపోతే, ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం కొత్త పంథాను అనుసరించబోతోంది. రాష్ట్రంలో వుడా, తుడా, విజిటిఎంవుడా వంటి నగరాభివృద్ధి సంస్థలు ఉన్నాయి.
వీటిలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాల్సి ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే అవకాశం లేదు. అందుకే ఆయా నగరాభివృద్ధి సంస్థలే స్వయంగా నిధులను సమకూర్చుకుని ప్రాజెక్ట్‌లు చేపట్టాలని ప్రభుత్వం సంకేతాలు పంపించింది. ఉదాహరణకు విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)లో సుమారు 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లు ప్రారంభించాల్సి ఉంది. విశాఖలో 400 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్, 150 కోట్లతో ఎన్‌ఎడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, 100 నుంచి 150 కోట్లతో కనె్వన్షన్ సెంటర్‌తోపాటు అనేక ప్రాజెక్ట్‌లు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే శ్రీకాకుళంలో సుమారు 20 కోట్లు, విజయనగరంలో మరో 20 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వుడా చేపడుతోంది. దీనికి ప్రభుత్వం నిధులిచ్చే అవకాశం లేదు. అందుకని వుడా ల్యాండ్ పూలింగ్‌కు వెళ్లే ఆలోచనలో ఉంది. రాజధాని అమరావతిలో చేపట్టిన విధంగా భూమిని సమీకరించి, దాన్ని అభివృద్ధి చేసి, భూమి విలువ పెంచి, భూములు ఇచ్చిన రైతులకు కొంత భాగం ఇచ్చి, మిగిలిన భూమిని విక్రయించాలన్న ఆలోచనలో వుడా ఉంది. ఇందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
ఇలా భూమిని విక్రయించగా వచ్చిన మొత్తంతో ప్రాజెక్ట్‌లను ప్రారంభించాలన్న ఆలోచనలో వుడా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సలహా మేరకు వుడా అధికారులు భూ సమీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారు.