అంతర్జాతీయం

ముగ్గురు బ్రిటిష్ సైంటిస్టులకు ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోమ్, అక్టోబర్ 4: ఈ ఏడాది ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతిని ముగ్గురు బ్రిటిష్ శాస్తవ్రేత్తలు దక్కించుకున్నారు. టోపాలాజికల్ ఫేజ్ ట్రాన్సిషన్స్, టోపాలాజికల్ ఫేజెస్ ఆఫ్ మ్యాటర్స్‌కు చెందిన పరిశోధనలు నిర్వహించినందుకు గాను డేవిడ్ దౌలె, డంకన్ హాల్డన్, మైకేల్ కోస్టెర్లిజ్‌లకు ఈ అవార్డు లభించింది. ఈ ముగ్గురు శాస్తవ్రేత్తలు కూడా బ్రిటన్‌లో పుట్టి అమెరికాలో పని చేస్తున్నారు. 82 ఏళ్ల దౌలెస్ యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తుండగా, 65 ఏళ్ల హాల్డన్ న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. 73 ఏళ్ల కోస్టెర్లిజ్ రోడ్స్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్శిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్. 7,18,000 బ్రిటిష్ పౌండ్ల ప్రైజ్‌మనీలో సగభాగం హాల్డన్‌కు లభించనుండగా, మిగతా సగం మొత్తాన్ని మిగతా ఇద్దరూ సమానంగా పంచుకుంటారు. ఖగోళంలో రూపు మార్చుకొంటున్న పదార్థాల సమూహాలపై అధ్యయనం చేసే శాస్త్రం టోపాలజీ. వీరు ముగ్గురూ ఈ రంగంలో పరిశోధనలు చేశారు. రూపు మార్చుకుంటున్న పదార్థాల సమూహాలు ఒకదానితో మరోదానికి సంబంధం ఉందా లేక అవి సహజసిద్ధంగా రూపు మార్చుకుంటున్నాయా అనే అంశంపై వీరు జరిపిన పరిశోధనలు విప్లవాత్మక మార్పులకు కారణమైనాయి. 1970, 80 దశకాల్లో వీరు ఈ పరిశోధనలు జరిపారు. ఈ ఏడాది నోబెల్ బహుమతుల ప్రకటన సోమవారం మెడిసిన్‌లో జపాన్ శాస్తవ్రేత్తకు ప్రకటించడంతో మొదలైంది. కాగా, బుధవారం రసాయనిక శాస్త్రంలో నోబెల్‌ను ప్రకటిస్తారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించనుండగా, వచ్చేవారం ఆర్థిక శాస్త్రం, సాహిత్యంలో నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తారు.

నోబెల్ పురస్కారాల వ్యవస్థాపకుడు ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజయిన డిసెంబర్ 10వ తేదీన జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలు పురస్కారాలను అందుకుంటారు.