జాతీయ వార్తలు

కేజ్రీవాల్ కేక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రెండు జాతీయ రాజకీయ పార్టీలకు విఘాతకరంగా పరిణమించడమే కాకుండా అతి స్వల్ప వ్యవధిలోనే కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ విజయదుందుభి మోగించింది. 2014లోనే స్వల్ప వ్యవధితోపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాల్లో 67 సీట్లను గెలుచుకుని ప్రాంతీయ పార్టీలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
లోక్‌సభ ఎన్నికల విజయంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే స్థాయిలో విజయభేరి మోగించాలనుకున్న ఈ ఫలితాలు విస్మయకరంగా పరిణమించాయి. దాదాపు 15 సంవత్సరాలపాటు రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేని పరిస్థితి తలెత్తింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇంత భారీ పరాజయాన్ని ఢిల్లీ ఎన్నికల్లోనే బిజెపి చవిచూసింది. ముఖ్యం గా బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీచేసిన కిరణ్‌బేడీ కూడా ఓడిపోవడం ప్రధానంగా పేర్కొనాలి. నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వమంతా ఢిల్లీలోనే మకాం పెట్టినా కేజ్రీవాల్ జనాకర్షక శక్తి ముందు అవేవీ పనిచేయలేదు.