జాతీయ వార్తలు

అది సైన్యాన్ని అవమానించడమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై జరిపిన సర్జికల్ స్ట్రయిక్‌పై సాక్ష్యాలు చూపమనడం సైన్యాన్ని అవమానించడమేనని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అలాంటి అసందర్భ డిమాండ్లు చేయడం సిగ్గుచేటైందని ఆయన విమర్శించారు. ఉగ్రవాద స్థావరాలపై ఎంతో శౌర్య, సాహసాలతో దాడులు చేసిన సైనికులను శ్లాఘించేదిపోయి చర్చ చేయడం దారుణమని బుధవారం ఇక్కడ పేర్కొన్నారు. ‘ఇలాంటి అసందర్భ డిమాండ్లు, బాధ్యతారాహిత్యమైన ప్రకటనలపై స్పందించాల్సి అవసరం లేదు’ అని వెంకయ్య అన్నారు. దీనిపై కాంగ్రెస్, ఆప్ నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. దేశంకోసం త్యాగాలు చేస్తున్న సైనికుల ఆత్మస్థయిర్యం దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకూడదని ఆయన హితవు చెప్పారు. భారత సైన్యం శక్తి, సామర్థ్యాలు శంకించాల్సిన అవసరం లేదన్న వెంకయ్యనాయడు ‘దేశ భద్రతకోసం సైనికులు చేస్తున్న సేవలు నిరుపమానం’ అని వ్యాఖ్యానించారు. వారి చర్యలపై అనవసర చర్చకు ఆస్కారం కల్పిండం అంటే సైన్యాన్ని అవమానించినట్టేనని మంత్రి తెలిపారు. ‘ఈ విషయంలో ఏ ఒక్క భారతీయుడికి అనుమానాలు ఉండవన్నది నా విశ్వాసం. భారత సైన్యం అంకితభావం, ధైర్య సాహసాలను అనుమానించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటి దానిపై చర్చకు డిమాండ్ చేస్తే కచ్చితంగా సైనికులను కించపరచడం, అవమానించడమే’ అని బిజెపి సీనియర్ నేత చెప్పారు. అఖిల పక్ష సమావేశంలో మిలటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్ (డిజిఎంఓ) సర్జికల్ దాడిపై పూర్తి వివరాలు అందించారని మంత్రి గుర్తుచేశారు. సర్జికల్ దాడిపై యావత్ భారతదేశం ఎంతో సంతోషం వ్యక్తం చేయడమేకాకుండా సైన్యాన్ని కీర్తించిందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. భారత సైనికుల దాడిలో తమ వాళ్లను కోల్పోయిన పాకిస్తాన్ కనీసం వారి అంత్యక్రియలు నిర్వహించుకునే స్థితిలో లేదని, అది వారి సంస్కృతి అని మంత్రి ఎద్దేవా చేశారు. పొరుగుదేశాలపై యుద్ధం చేయాలన్న ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదన్న మంత్రి ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

ఢిల్లీలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం వెలుపలకు వస్తున్న కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, వెంకయ్య నాయుడు