జాతీయ వార్తలు

వేరు కాపురమంటే విడాకులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: వయోవృద్ధులైన తల్లిదండ్రుల నుంచి దూరంగా వేరు కాపురం పెట్టడానికి భార్య ప్రయత్నిస్తే హిందూ భర్త ఆమె నుంచి విడాకులు కోరేందుకు అన్ని విధాలా అర్హుడని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ‘‘ఒక మహిళ వివాహం తరువాత భర్త కుటుంబంలో భాగస్వామి అవుతుంది. అయితే, భర్త సంపాదనను తాను మాత్రమే పూర్తిగా అనుభవించాలనే కారణంతో భార్య తన భర్తను తల్లిదండ్రుల నుంచి వేరుగా వెళ్లాలని కోరడానికి వీల్లేదు’’ అని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. తల్లిదండ్రుల నుంచి వేరుపడటం సాధారణ సంప్రదాయమేం కాదు. ‘‘ఓ హిందూ కొడుకు పెళ్లి చేసుకుని, తన భార్య కోసం పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల నుంచి వేరు పడాలని కోరుకోవటం ఆహ్వానించదగ్గ సంస్కృతి కానే కాదు. ముఖ్యంగా కుటుంబంలో సంపాదించేది కొడుకు ఒక్కడే అయినప్పుడు ఈ విధంగా కోరుకోవటం అసమంజసం. తన తల్లిదండ్రుల వల్ల ఎదిగి, విద్యాబుద్ధులు నేర్చుకున్న కొడుకు, ఆ తల్లిదండ్రులను చూసుకోవలసిన నైతిక, చట్టబద్ధమైన బాధ్యత కూడా ఉంది. వాళ్లు వృద్ధులై, ఎలాంటి ఆదాయం లేనప్పుడు, లేదా అతి నామమాత్రపు ఆదాయం ఉన్నప్పుడు వాళ్లను సంరక్షించాల్సిన బాధ్యత కొడుకుపై ఉంది.’’ అని న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సాధారణంగా పాశ్చాత్య దేశాలలో మెజారిటీ రాగానే లేదా పెళ్లి చేసుకోగానే కుటుంబం నుంచి కొడుకు వేరుగా వెళ్లిపోతాడని, కానీ మన దేశంలో వైవాహిక జీవితానికి సంబంధించి ఇలాంటి ఆలోచనలను అంగీకరించరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాధారణ పరిస్థితుల్లో భార్య వివాహం అయిన తరువాత భర్త కుటుంబంలో అభిన్న భాగస్వామి అవుతుందని పేర్కొంది. ‘‘ఒకసారి తాను భర్త కుటుంబంలో భాగస్వామి అయిన తరువాత సమంజసమైన, బలమైన కారణం లేకుండా ఆమె ఎట్టి పరిస్థితిలోనూ కుటుంబం నుంచి భర్తను వేరుచేయజాలదు’’ అని జస్టిస్ దవే అన్నారు. ఇటీవల విడాకులకు సంబంధించిన రెండు కేసులను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. 1992లో వివాహం చేసుకున్న కర్ణాటకకు చెందిన దంపతులకు భార్య వేధింపుల కారణంతో కింది కోర్టు విడాకులు మంజూరు చేసింది. భర్తను అనుమానంగా చూడటం, పనిమనిషితో ఆయనకు వివాహేతర సంబంధం ఉందని భార్య ఆరోపించింది. అయితే ఆ తరువాత ఆమె చెప్పిన పనిమనిషి ఎన్నడూ ఆ ఇంట్లో పని చేయనే లేదని తేలింది. మరో కేసులో తన భర్త సంపాదనపైనే ఆధారపడి జీవిస్తున్న అతని తల్లిదండ్రులను విడిచిపెట్టి వేరు కాపురం పెట్టడానికి అంగీకరించనందుకు ఆత్మహత్యాయత్నం చేసింది. చివరి నిమిషంలో ఆమెను భర్త కాపాడాడు. ఒక వేళ ఆమెను రక్షించకపోయి ఉంటే అతను చట్టపరంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేదోనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.