జాతీయ వార్తలు

ఎట్టకేలకు చిక్కిన చోటా రాజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

90వ దశకం తొలి నాళ్లలో ముంబయిలో మారణకాండ సృష్టించిన గొలుసు పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడైన చోటా రాజన్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. మారుపేరుతో తిరుగుతున్న రాజన్ ఇండోనేషియాలోని ఎయిర్‌పోర్ట్‌లో పొరపాటున అసలు పేరు చెప్పి దొరికిపోయాడు. గత కొన్ని సంవత్సరాలుగా రాజన్‌పై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేసింది. అంతకుముందు ఆస్ట్రేలియాలో రాజేంద్ర సదాశివ్ నిఖల్జీ అలియాస్ మోహన్‌కుమార్‌గా మారుపేర్లతో గడిపిన రాజన్ ఉనికిని ఆస్ట్రేలియా అధికారులు గుర్తించి సమాచారం అందించడంతో అంతిమంగా అతన్ని అరెస్టు చేయడం, భారత్‌కు అప్పగించడం జరిగింది. ముంబయి సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో హత్య, అక్రమంగా ఆయుధాలు కలిగివుండటం వంటి ఎన్నో కేసులు రాజన్‌పై నమోదయ్యాయి. ముఖ్యంగా జ్యోతివౌడే అనే జర్నలిస్టులు హత్య చేశాడన్నది రాజన్‌పై ఉన్న ప్రధాన అభియోగం.