జాతీయ వార్తలు

జయకు పరామర్శల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 9: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా ఆదివారం అనేక మంది రాజకీయ ప్రముఖులు ఇక్కడ అపోలో ఆసుపత్రికి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులు తనకు అన్ని విషయాలు చెప్పారని, జయ ఆరోగ్యం గురించి ఎలాంటి వదంతులను ప్రచారం చేయటం సమంజసం కాదని అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెంకయ్యనాయుడు అన్నారు. జయ ఆరోగ్యం మెరుగవుతోందని, అన్ని విధాలుగా చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తనకు తెలిపారన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఆసుపత్రికి వచ్చి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ‘‘ జయలలిత త్వరగా కోలుకొని తిరిగి తన విధులను సాధారణంగా నిర్వహించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఆమె పూర్తిగా కోలుకుంటారని నాకు విశ్వాసం ఉంది’’ అని నారాయణస్వామి అన్నారు. తమిళమానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జికె వాసన్ కూడా ఆసుపత్రికి వచ్చి వైద్యులను జయ ఆరోగ్య పరిస్థితిని విచారించారు. ఆమె త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సిపిఐ జాతీయ నేత డి.రాజా కూడా జయను ఆసుపత్రిలో పరామర్శించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జయ త్వరగా కోలుకోవాలని అన్నాడిఎంకె కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహించారు. నెత్తిన పాలకుండలు పెట్టుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. శరవణపోల్గాయ్ టాంక్ నుంచి తిరుపరన్‌కుందరమ్ దగ్గరున్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయం దాకా ఈ ప్రదర్శన కొనసాగింది. అనేక దేవాలయాల్లో ఆమ్మ ఆరోగ్యం కుదుట పడాలని యజ్ఞాలు జరిగాయి. చర్చిల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

జయలలితను పరామర్శించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, పాండిచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ సామి, సిపిఐ నేత డి.రాజా