జాతీయ వార్తలు

సింగిల్ ఫార్మాట్‌తో సర్కారీ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: జనన మరణ ధ్రువీకరణ పత్రాలు సహా ప్రభుత్వ సేవలకు సంబంధించిన అన్ని అంశాలను వెల్లడించే ప్రక్రియను సరళతరం చేశారు. ఎక్కువ పేజీలతో కూడుకున్నదిగా కాకుండా ఒకే పేజీలో ఈ రకమైన వివరాలన్నీ పొందుపర్చేందుకు వీలుగా ఓ ఫార్మాట్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఈమేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం సరికొత్త విధానాన్ని ఆవిష్కరించారు. సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా ఈ ఏక పేజీలో సమస్త వివరాలు అన్న కొత్త విధానానికి నాంది పలికారు. ప్రభుత్వం చేపట్టే వివిధ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు సంక్లిష్టంగా ఉన్నాయని, ఎన్నో ఫారాలను అభ్యర్థులు నింపాల్సి వస్తోందని తెలిపారు. దీని దృష్ట్యా ఈ ప్రక్రియను సరళతరం చేయడానికి, పెన్షనర్ల కోసం ఒకే పేజీ దరఖాస్తు ఫారాన్ని విడుదల చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మిగతా ఇతర ఫారాలను కూడా ఒకే పేజీకి కుదించడానికి తగిన చర్యలు చేపడతామని, ఏడాదిలోగానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. లబ్దిదారుడికి ఎలాంటి సంక్లిష్టతా లేకుండా చాలా సులభంగానే పూర్తి చేసేందుకు వీలుగా ఈ ఫారాలను రూపొందిస్తున్నామని వెల్లడించారు. స్పష్టమైన, సహేతుకమైన, కనీస సమాచారంతో ఈ దరఖాస్తు ఫారాన్ని నింపవచ్చని, అడిగిందే అడక్కుండా ప్రతి చిన్న విషయంలోనూ చాలా స్పష్టంగా ఈ ఫారాలు ఉంటాయని తెలిపారు. ఈ కొత్త విధానానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలతోను, కేంద్రపాలిత ప్రాంతాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ప్రతి నెలలోనూ రెండు ప్రభుత్వ విభాగాలతో సమావేశాలు నిర్వహించి వాటి పరిధిలోకి వచ్చే సేవల వివరాలను సమీక్షిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి మొత్తం ప్రక్రియనే మరింత సరళతరం చేసే దిశగా తదుపరి ప్రయత్నాలు చేపడతామని, ఏడాదిలోగానే సింగిల్ పేజీ ఫార్మాట్‌ను అన్ని విభాగాలకు అందుబాటులోకి తేగలమన్న ఆశాభావాన్ని మంత్రి జితేంద్ర సింగ్ వ్యక్తం చేశారు. ప్రస్తుతం జనన, మరణ ఇతర సర్ట్ఫికెట్ల కోసం సుదీర్ఘమైన వివరాలను భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని, ఈ సింగిల్‌పేజ్ ఫార్మాట్‌తో అందరూ కూడా సులభతరమైన రీతిలోనే తమ వివరాలను వెల్లడించే వీలుంటుందన్నారు. ప్రభుత్వ సేవలకు ఆధార్‌ను అనుసంధానం చేసే ఆలోచనను ప్రభుత్వం పరిశీలిస్తోందని సిబ్బంది మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ కొఠారి తెలిపారు. దీనివల్ల ప్రజలు మళ్లీ పూర్తి వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. ఆధార్ డేటాను ఈ సర్వీసులతో సంధానం చేయడం వల్ల అనేక రకాలుగా వెసులుబాటు కలుగుతుందన్నారు. అయితే, దేశ ప్రజలు అందరికీ ఆధార్ నెంబర్లు అందుబాటులో ఉంటేనే ఈ ప్రక్రియ సాధ్యమవుతుందని, పైగా ఇంటి చిరునామా సహా ఇతర వౌలిక వివరాలను కూడా వెల్లడించాల్సిన అవసరం ఉందని అన్నారు.