అంతర్జాతీయం

అనుకోని అతిథి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

...................
కలిసే నడుద్దాం

లాహోర్ విమానాశ్రయంలో దిగిన నరేంద్ర మోదీకి ఎదురెళ్లి స్వాగతం పలికి తీసుకొస్తున్న పాక్ ప్రధాని నవాజ్ షరీష్
...................

లాహోర్, డిసెంబర్ 25: భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త శకం ఆవిష్కృతమైంది. ఇప్పటి వరకూ ప్రొటోకాల్స్‌కే పరిమితమైన రెండు దేశాల మైత్రీ బంధం నాటకీయ రీతిలో శుక్రవారం అనూహ్య మలుపు తిరిగింది. రష్యానుంచి అఫ్గానిస్తాన్ వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పాకిస్తాన్‌లో పర్యటించారు. శక్రవారం ఉదయం పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మోదీ ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భంగా మాట్లాడిన షరీఫ్ తన మనవరాలి పెళ్లికి రావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు. ఆ వెంటనే తాను మధ్యాహ్నం లాహోర్ వెళుతున్నట్టు మోదీ ట్వీట్ చేశారు. చకచకా భద్రతా పరమైన ఏర్పాట్లు లాహోర్‌లో జరిగిపోయాయి. అనుకోకుండా..ఆకస్మికంగా లాహోర్ వచ్చిన మోదీకి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో మోదీని 20కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి నవాజ్ తీసుకెళ్లారు. ఇరు దేశాల ప్రధానులు కలిసి హెలికాప్టర్‌లో పర్యటించడం అన్నది ఇదే మొదటిసారి. ఇద్దరి మధ్య దాదాపు 80నిముషాల పాటు చర్చలు జరిగాయి. నవాజ్ మనవరాలు మెహ్రున్ నిసా పెళ్లికి హాజరైన మోదీ అక్కడ ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్, ఇతర భారత అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం వీరి మధ్య జరిగిన చర్చల్లో అనేక ద్వైపాక్షిక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రెండు దేశాల ప్రజల మధ్య సుహృద్భావం, సత్సంబంధాలకు మరింతగా మార్గాన్ని సుగమం చేయాలని సంకల్పించారు. ఇప్పటి వరకూ ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియని రీతిలో కొనసాగిన ఇరు దేశాల సంబంధాలకు మోదీ ఆకస్మిక పర్యటన సరికొత్త ఊతాన్నందించింది. ఈ పర్యటన ప్రపంచ దేశాలనే ఆశ్చర్యానికి లోనుచేసింది. మొత్తం 150నిముషాల పాటు భారత ప్రధాని పాకిస్తాన్‌లో గడిపారు. మోదీ ఆకస్మిక పర్యటన, అనంతరం పాక్ ప్రధానితో జరిపిన చర్చలు రెండు దేశాల మధ్య సానుకూల స్ఫూర్తిని పెంపొందించడానికి ఉద్దేశించినవేనని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. మొదట మామూలుగానే నవాజ్‌కు మోదీ ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని, ఆ తర్వాత తన మనవరాలి పెళ్లి విషయాన్ని నవాజ్ ప్రస్తావించడం..హాజరు కావాలని ఆహ్వానించడం చకచకా జరిగిపోయాయని భారత వర్గాలు స్పష్టం చేశాయి. ఢిల్లీ వెళ్లే ముందు మోదీ లాహోర్‌లో ఆగడాన్ని సుహృద్భావ పర్యటనగా పాకిస్తాన్ అభివర్ణించింది. ఇటీవల రెండు దేశాల మధ్య కుదిరిన సమగ్ర చర్చల ప్రక్రియను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపైనా మోదీ-నవాజ్‌లు మాట్లాడుకున్నారని తెలిపాయి. ఈ చర్చల ప్రక్రియలో భాగంగా రెండు దేశాల విదేశాంగ కార్యదర్శులు వచ్చే నెల్లో ఇస్లామాబాద్‌లో సమావేశమవుతారని పాక్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి తెలిపారు. పరస్పర అభిప్రాయాలను గౌరవించుకుంటూ శాంతి, సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందించేందుకు మరింతగా కృషి చేయాలని నవాజ్-మోదీలు నిర్ణయించుకున్నారని తెలిపారు.

నాటి ప్రధాని వాజపేయి లాహోర్ వెళ్లినపుడు కార్గిల్ యుద్ధం జరిగింది. మరిప్పుడు -లాహోర్‌లో నరేంద్ర మోదీ పర్యటించారు. ఇప్పుడెలాంటి ఉపద్రవం రాబోతుందో.
- మనీష్ తివారి, కాంగ్రెస్

ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. ఆకస్మికంగా పాకిస్తాన్‌లో పర్యటించడం ఇరు దేశాల సంబంధాలకు సరికొత్త ఊతమిచ్చినట్టే. పొరుగు దేశాలతో ఎలా ఉండాలో మోదీ నిరూపించారు.
- సుష్మాస్వరాజ్, బిజెపి