జాతీయ వార్తలు

చెరగని ఆనవాలు.. సరస్వతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: భారత దేశ సుసంపన్నమైన నాగరికత అభివృద్ధికి మూలకారకమైన సరస్వతీ నది అస్తిత్వం తిరుగులేనిదని మరోసారి స్పష్టమైంది. వేల ఏళ్లనాటి ఈ దేశ నాగరికత సరస్వతీనదీ పరీవాహక ప్రాంతంలో విలసిల్లినది ముమ్మాటికీ వాస్తవమని తేలిపోయింది. కుత్సితపు ప్రచారాలకు, కుటిల వక్రీకరణలకు ఇప్పుడిక కాలం చెల్లింది. భారత సంస్కృతి, చరిత్రలకు మసిపూసి మారేడుకాయ చేయటం సాధ్యం కాదని స్పష్టమైంది. భారత్ పాకిస్తాన్‌లలో మొత్తం నాలుగువేల కిలోమీటర్ల పొడవున సరస్వతీనది ప్రవహించి పశ్చిమ సముద్రంలో సంగమించినది సత్యమని కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ నియమించిన అధికారిక కమిటీ సహేతుకమైన ఆధారాలతో నిరూపించింది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సరస్వతీనదిని ఇప్పటివరకు పుక్కిటి పురాణంగా కొట్టిపారేసిన వారికి జలవనరుల నిపుణుల కమిటీ నివేదిక సరస్వతి అస్తిత్వానే్న కాకుండా, అనేక పట్టణాల నాగరికతకు సంబంధించిన చరిత్రనూ నిరూపించింది. ఈ కమిటీ సమర్పించిన నివేదికను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం తదుపరి చర్యలను చేపడుతుందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. ‘సరస్వతీ నది నిజంగానే ఉందని మేము నిర్ధారణకు వచ్చాం. హిమాలయాల్లో పుట్టిన ఈ నది సుదూరంగా ప్రవహించి పశ్చిమ తీరాన సముద్రంలో సంగమించింది’ అని నిపుణుల కమిటీకి సారథ్యం వహించిన ప్రఖ్యాత జియలాజిస్టు ప్రొఫెసర్ కెఎస్.వాల్దియా తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తూ వెల్లడించారు. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు గుజరాత్ ఉత్తర ప్రాంతం మీదుగా సాగిన ఈ నది పరివాహక ప్రాంత ఉపరితలాన్ని తాము క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
ఇదిలావుంటే, దాదాపు 4వేల కిలోమీటర్ల పొడవైన ఈ నది రాణ్ ఆఫ్ కచ్ వద్ద పశ్చిమ సముద్రంలో సంగమించడానికి ముందు పాకిస్తాన్ మీదుగా కూడా ప్రవహించిందని కేంద్ర భూగర్భ జల వనరుల బోర్డు (సిజిడబ్ల్యుబి)కు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సరస్వతీ నది పరివాహక ప్రాంతంలో మూడింట ఒక వంతు భాగం పాకిస్తాన్‌లోనూ, మిగిలిన రెండు వంతుల భాగం (దాదాపు 3 వేల కిలోమీటర్లు) మన దేశంలోనూ ఉందని ఆయన తెలిపారు.
సరస్వతీ నదికి రెండు (పశ్చిమ, తూర్పు) శాఖలు ఉన్నట్లు ఏడుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. హిమాలయాల్లో పుట్టి ప్రస్తుతం ఘగ్గర్-పటియాలీవాలీ ఉప నదులుగా కాలువల రూపంలో ప్రవహిస్తున్న అలనాటి సట్లజ్ పురాతన సరస్వతీ నది పశ్చిమ శాఖకు చెందినవి కాగా, యుమునా నది పాయలుగా చిరపరిచతమైన మరకందా, సరసుతి (సరస్వతి పేరును తప్పుగా పేర్కొన్నారు) తూర్పు శాఖకు చెందినవని ఈ కమిటీ వివరించింది. ప్రస్తుతమున్న ఘగ్గర్, సరసుతి, హక్రా, నరా నదులుగా రూపాంతరం చెందడానికి ముందు సరస్వతీ నది ప్రవాహం అదృశ్యమైన ప్రాంతాన్ని ఆరు నెలల అధ్యయన కాలంలో తాము విస్తృతంగా పరిశోధించామని, ఆ ప్రాంతం చుట్టుపక్కల హరప్పా నాగరికత కాలంలో దాదాపు 1,700 వరకూ చిన్న, పెద్ద పట్టణాలు ఉన్నట్లు చరిత్రను బట్టి స్పష్టమవుతోందని ‘పద్మ భూషణ్’ అవార్డు గ్రహీత వాల్దియా తెలిపారు. వీటిలో కొన్ని పట్టణాలు వందకు పైగా హెక్టార్లలో విస్తరించి ఉండేవని, దాదాపు 5,500 ఏళ్ల క్రితం నాటి ఈ పట్టణాలు నీరు లేకుండానే మనుగడ సాగించాయా? అన్న ప్రశ్నకు లేదన్న సమాధానమే వస్తోందని, ఈ పట్టణాలతో పాటు ఆ ప్రాంతంలోని పలు గ్రామాలు సరస్వతీ నది ప్రవాహం నుంచే నీటిని పొందినట్లు తెలుస్తోందని ఆయన వివరించారు. ఆరు నెలల అధ్యయన కాలంలో తాము పరిశోధించిన అవశేషాలు, వాటి ఆకృతి, లక్షణాలను చూస్తుంటే ఇవన్నీ ‘పెద్ద నది’ నుంచే ఉద్భవించినట్లు స్పష్టమవుతోందని, ఈ అవశేషాలన్నీ ప్రస్తుత ఘగ్గర్, గంగా, యమునా నదుల వద్ద గల అవశేషాలను అచ్చుగుద్దినట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. సరస్వతీ నది ప్రవాహం అదృశ్యమైన ప్రాంతాల్లో కొన్ని చోట్ల దాదాపు 30 అడుగుల లోతైన ఇసుక పొరలు, మరికొన్ని ప్రాంతాల్లో ఐదు కిలోమీటర్ల వెడల్పున నీటితో నిండిన ప్రదేశాలు ఉన్నాయని, ప్రస్తుతమున్న ఘగ్గర్, దాని ఉప నది డాంగ్రీల్లో ఇటువంటి అవశేషాలు లేవని వాల్దియా వెల్లడించారు. అలాగే సరస్వతి నది ప్రవాహం అదృశ్యమైన వివిధ ప్రాంతాల్లో తాము సేకరించిన ఖనిజ లవణాలు, సట్లెజ్, యమునా నదీ పరివాహక ప్రాంతాల నుంచి సేకరించిన ఖనిజ లవణాలు ఒకే విధంగా ఉన్నాయని, ఇవన్నీ హిమాలయాల ఎగువ, దిగువ ప్రాంతాల నుంచి కొట్టుకు వచ్చినవేనని వాల్దియా పేర్కొన్నారు. ఈ ఖనిజ లవణాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే సరసుతి, ఘగ్గర్-హర్కాల రూపంలో ప్రవహించిన సరస్వతీ నది హిమాలయాల్లో ఉద్భవించినట్లు నిర్ధారణ అవుతోందని వాల్దియా కమిటీ స్పష్టం చేసింది.