జాతీయ వార్తలు

వారణాసి వంతెనపై తొక్కిసలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందౌలి , అక్టోబర్ 15: ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలో శనివారం అపశ్రుతి చోటుచేసుకుంది. బాబా జై గురుదేవ్ సభలో జరిగిన తొక్కిసలాటలో 24 మంది మృతి చెందారు. సభకు వేలాది మంది తరలిరావడంతో వారణాసి, చందౌలి మధ్య రాజ్‌ఘాట్ వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. జై గురుదేవ్ సభకు ఒక్కసారిగా భక్తులు ఎగబడ్డారు. దీనికి తోడు వంతెన ఇరుకుగా ఉండడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. అయితే సభలో పాల్గొనేందుకు నాలుగువేల మందికే అనుమతి ఉందని పోలీసు అధికారి జావేద్ అహ్మద్ వెల్లడించారు.
రాజ్‌ఘాట్ వంతెనపైకి భక్తులు ఒక్కసారిగా రావడంతో ఊపిరి ఆడక ఓ వ్యక్తి మృతి చెందాడని ఆయన అన్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో వంతెన కూలిపోతుందని వదంతులు వ్యాపించడంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగిందని అహ్మద్ చెప్పారు. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందగా, 60 మంది గాయపడ్డారని చందౌలి జిల్లా మెజిస్ట్రేట్ కుమార్ ప్రశాంత్ స్పష్టం చేశారు. పోలీసులు, అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. తొక్కిసలాట సంఘటనపై విచారణకు ఆదేశించిన జిల్లా మెజిస్ట్రేట్, నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై చర్య తీసుకుంటామని ప్రకటించారు. కాగా తొక్కిసలాట ఘటనపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండేసి లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. గాయపడ్డవారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్టు శాంతి భద్రతల విభాగం ఐజి హరిఓం శర్మ తెలిపారు. అయితే తొక్కిసలాటకు పోలీసులే కారణమంటూ జై గురుదేవ్ సంస్థాన్ అధికార ప్రతినిధి రాజ్ బహదూర్ ఆరోపించారు. సభకు వస్తున్న భక్తులను క్రమబద్ధీకరించకుండా వెనక్కినెట్టేశారని దీంతో గందరగోళం తలెత్తి తొక్కిసలాటకు దారితీసిందని అన్నారు. వంతెన కూలిపోయిందన్న వదంతులు మరోకారణమని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
యూపీలో జరిగిన తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆయన అన్నారు. తొక్కిసలాట బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులను మోదీ ఆదేశించారు. ప్రస్తుతం గోవాలోని బ్రిక్స్ దేశాల సమావేశంలో ఉన్న ప్రధాని ప్రమాదంపై ట్వీట్ చేశారు.

చిత్రం... కుప్పలుగా పడివున్న మృతదేహాలు. ప్రమాదానికి ముందు వంతెనపై ర్యాలీ దృశ్యం