జాతీయ వార్తలు

షిరిడీ సాయబాబాకు రూ.4.43 కోట్ల విరాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిరిడి, అక్టోబర్ 15: షిరిడిలోని సాయిబాబాకు ఇటీవల నాలుగు రోజులపాటు సాగిన దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులు రూ. 4కోట్లకు పైగా విరాళాలను అందజేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10 నుంచి 13వ తేదీ వరకు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు (ఎస్‌ఎస్‌ఎస్‌టి)కు చెందిన వివిధ హుండీలు, నగదు కౌంటర్లు, ఆన్‌లైన్ కౌంటర్ల ద్వారా ఆలయానికి రూ.4.43 కోట్ల ఆదాయం సమకూరినట్లు ట్రస్టు ఆఫీస్ బేరర్లు తెలిపారు. సాయిబాబా 98వ వర్థంతి కూడా వచ్చిన ఈ రోజులలో దేశ విదేశాలకు చెందిన సుమారు 3లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారని ట్రస్టు కార్యనిర్వహణ అధికారి బాజీరావు షిండే తెలిపారు. ఆలయానికి వచ్చిన విరాళాలలో రూ. 1.93 కోట్లు హుండీల ద్వారా, రూ.93.86 లక్షలు ఎస్‌ఎస్‌ఎస్‌టి నగదు కౌంటర్ల ద్వారా, రూ.26.25 లక్షలు ఆన్‌లైన్ ద్వారా స్వీకరించినట్లు ఆయన వివరించారు. ట్రస్టు ప్రపంచ వ్యాప్తంగా గల 17 దేశాల నుంచి రూ.7.22 లక్షల విరాళాలు స్వీకరించిందని ఆయన తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రవాస భారతీయుడు 748 గ్రాముల స్వర్ణ కిరీటాన్ని బహూకరించినట్లు ఆయన చెప్పారు. ఆలయానికి విరాళాలుగా వచ్చిన బంగారు, వెండి ఆభరణాల విలువ రూ.23.49 కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు. ట్రస్టు వద్ద ప్రస్తుతం రూ.67 కోట్ల విలువ గల 364 కిలోల బంగారం ఉందని వివరించారు.