జాతీయ వార్తలు

విభేదాలున్నా.. ఉగ్రవాదంపై ఒకటవుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, అక్టోబర్ 15: భారత్ చైనాల మధ్య విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో మాత్రం రెండూ ఒకటి కావలసిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు స్పష్టం చేశారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో మోదీ శనివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు గోవా వచ్చిన జిన్‌పింగ్‌తో నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పాకిస్తాన్‌లో తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్‌పై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించాలన్న భారత్ డిమాండ్‌కు ఇప్పటికి మూడుసార్లు మోకాలడ్డిన చైనా, శనివారం నాటి చర్చల్లో కూడా సానుకూలంగా స్పందించలేదు.
‘‘చైనా, భారత్ మధ్య విభేదాలు ఉండవచ్చు, అవి ఉగ్రవాదంపై భారత్, చైనాలు కలిసి పోరాడటానికి సమస్య కారాదనే కోరుకుంటాను’’ అని మోదీ అన్నారు. ఇరువురు నేతలు ఉగ్రవాదమే ప్రధాన అజెండాగా చర్చలు జరిపారని, రెండు దేశాలు పరస్పర సహకారంతో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవలసిన అవసరం ఉందని అంగీకరించారని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. మసూద్ అజర్ అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదం నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు. దీన్ని ఎదుర్కోవటానికి భారత్-చైనా సహకారాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఉంది అని మోదీ పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. చర్చల్లో మసూద్ అజర్‌పై నిషేధం ప్రధానాంశంగా చర్చకు వచ్చిందని వికాస్ స్వరూప్ అన్నారు. ‘మన ఆందోళనల తీవ్రత చైనాకు బాగా తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిస్టులను ఐక్యరాజ్యసమితి నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. అణు ఇంధన సరఫరా దేశాల గ్రూప్‌లో సభ్యత్వంపై కూడా మోదీ జిన్‌పింగ్‌తో చర్చించారు. ఈ అంశంపై ఇప్పటికే ఒక దఫా చర్చలు చైనాతో జరిగాయి. త్వరలోనే రెండోసారి చర్చలు జరుపుదామని జిన్‌పింగ్ మోదీకి హామీ ఇచ్చారు. ‘‘చైనా పాకిస్తాన్ లాంటి దేశం కాదు. నిదానంగానైనా సరే తప్పనిసరిగా భారత్ వైపు వస్తుంది. ఎందుకంటే అది చాలా శక్తిమంతమైన, ప్రగతిశీల దేశం’’ అని వికాస్ స్వరూప్ వ్యాఖ్యానించారు.
దక్షిణాఫ్రికాకు కృతజ్ఞతలు
అణు ఇంధన సరఫరా దేశాల గ్రూప్‌లో భారత్ సభ్యత్వానికి మద్దతునిచ్చినందుకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా గోవాకు వచ్చిన జుమాతో మోదీ శనివారం రాత్రి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ దేశాలు గ్రూపుగా ఏర్పడటంలో దక్షిణాఫ్రికా పాత్ర చాలా కీలకమైందని ఆయన ప్రశంసించారు. జుమాతో సమగ్రమైన చర్చలు జరిగాయని, భారత్ దక్షిణాఫ్రికాల అనుబంధాన్ని ఈ చర్చలు మరింత ద్రుఢపరిచాయని మోదీ సమావేశం అనంతరం ట్వీట్ చేశారు.
chitram....
బ్రిక్స్ దేశాధినేతలు బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ తెమెర్, చైనా అధ్యక్షుడు జీ జింన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాలతో ప్రధాని నరేంద్ర మోదీ.
దేశ రక్షణకు సంబంధించి రష్యా బృందంతో సమావేశమైన భారత బృందం.